గుంటూరు

తల్లీ బిడ్డల సంక్షేమం కోసమే 102 ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జిజిహెచ్‌కు దీటుగా తెనాలి ఆసుపత్రిని తయారుచేస్తాం: మంత్రి ప్రత్తిపాటి
తెనాలి, జనవరి 1: తల్లీబిడ్డల సంక్షేమం కోసమే 102 ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టినట్టు, గుంటూరు జిల్లా ఆసుపత్రికి దీటుగా తెనాలి ఆసుపత్రిని తయారుచేస్తామని, పేదప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రత్యేక శ్రద్ధ వహించిందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ ఆరోగ్య పథకం అమలులో భాగంగా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమాలకు మంత్రి పుల్లారావు హాజరయ్యారు. తొలుత ఆసుపత్రికి కేటాయించిన తల్లీబిడ్టల 102 ఎక్స్‌ప్రెస్ వాహనానికి జెండాఊపి ప్రారంభించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన యంత్ర పరికరాల గదిని మంత్రి ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగించారు. రాష్టల్రోని గ్రామీణ పేదలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న విషయాలను ముఖ్యమంత్రి గ్రహించి నందమూరి తారక రామారావు ఆరోగ్య వైద్య పథకం కింద 102 ఎక్స్‌ప్రెస్‌ను గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేకించి ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నా జరిగిందన్నారు. జిల్లాలో మోడల్, సకల వైద్యపరికాలున్న ఆసుపత్రిగా తెనాలి అవతరించనుందని రెండవ జిల్లా ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. డెల్టా ప్రాంత ప్రజలు ఈఆసుపత్రి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈపథకాన్ని ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారని, ఆక్రమంలోనే ఆయన ఆదేశాల మేరకు తెనాలి, గుంటూరులలో 102 ఎక్స్‌ప్రెస్ సేవలను నూతన సంవత్సరం రోజున ప్రారంభించటం జరిగిందని మంత్రి వివరించారు. అలాగే 108 సర్వీసు ద్వారా ప్రమాదాల నివారణలు అదుపులోకి వస్తుండగా 102 ద్వారా గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కలెక్టర్ కాంతీలాల్ దండే మాట్లాడుతూ డెల్టా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యాధునిక వైద్యసేవలను, గర్భిణులు, బాలింతలు 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెనాలి, వేమూరు ఎమ్మెల్యేలు అలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ పద్మజారాణి, మంగళగిరి టిడిపి ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి, వైద్య విధానపరిషత్ రీజనల్ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వరప్రసాద్, సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.