ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం 3 దశల్లో పోరాటం: పవన్‌కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ రెండున్నరేళ్లయినా అమలు కాలేదని, సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం దేశానికి తెలిసేలా ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేపడతానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధనకు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. టిడిపి, బిజెపి ఎంపీలను ఈ విషయమై నిలదీస్తామన్నారు. ‘రెండు రాష్ట్రాలు- ఒక ఓటు’ అని అలనాడు కాకినాడలో జరిగిన సమావేశంలో బిజెపి నేతలు తీర్మానించారని, అందుకే అదే కాకినాడలో జనసేన మొదటి సభ జరుగుతుందన్నారు. ఎపికి ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వంటి బిజెపి నేతలు ఇపుడు మాట మార్చడం తగదన్నారు. ఈ మాటలు తనకు అసహనాన్ని తెప్పిస్తున్నాయని పవన్ అన్నారు. యువత గురించి ప్రధాని మోదీ ఎంతో గొప్పగా చెబుతున్నారని, ఆయన అనుకున్నట్టు యువత ఎదగాలంటే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు.
తాను ఏ పార్టీకి అనుబంధంగా ఉండలేనని, హోదా సాధించేందుకు అన్ని పార్టీల నేతలను కలుస్తానన్నారు. ప్రత్యేక హోదా విషయమై సీమాంధ్రకు చెందిన ఎంపీలు దిల్లీలో ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు పోరాటం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని, ఇదే ధ్యేయంతో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళుతుందని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు కూడా హోదా కోసం కేంద్రంపై సరైన ఒత్తిడి తేవడం లేదన్నారు.
యువశక్తికి మేలు జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదన్నారు. దీన్ని సాధించేందుకు తాను వ్యక్తిగతంగా దిల్లీ వెళ్లి మోదీని గానీ, ఇంకెవరిని గానీ కలిసే ప్రసక్తి లేదని, జనంతో కదులుతూ సీమాంధ్రుల సత్తా ఏమిటో నిరూపిస్తానని ఆయన ప్రకటించారు.