ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి రూ.3,565 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ నీటిపారుదల రంగానికి 7,300 కోట్లు
లోటు ఉన్నా పన్నుల భారం వేయం
ఆర్థిక మంత్రి యనమల స్పష్టీకరణ

హైదరాబాద్, మార్చి 10: భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో 7,300 కోట్లు కేటాయించామని, అందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే 3,500 కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనున్నప్పటికీ ప్రస్తుతానికి రాష్ట్రప్రభుత్వమే ఖర్చు చేస్తోందని, కేంద్రంనుంచి నిధులు వచ్చాక రీయింబర్స్ చేసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకాడేది లేదని, లోటు ఎంత ఉన్నా పన్నుల భారం వేసేది లేదని యనమల చెప్పారు. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ప్రణాళికా వ్యయాన్ని చూపించినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఆ ప్రభావం కీలక రంగాలపై కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గత బడ్జెట్ కన్నా ఈసారి 20.03 శాతం ఎక్కువగా కేటాయించామని అన్నారు. రెవిన్యూ లోటు, ఆర్థిక లోటు ఈసారి స్వల్పంగా పెరుగుతుందని రెవెన్యూ లోటు 4,868 కోట్లు కాగా, ఆర్థిక లోటు 20,497 కోట్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అవి 2.99 శాతంగానూ, 0.71 శాతం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే క్రమంలో మనం ఊహించినట్టే ఎన్నో పెను సవాళ్లను ఎదుర్కొన్నామని, అయినా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో నిలబడగలిగామని అన్నారు. వనరుల కొరత, హుదుద్ తుపాను రూపంలో ప్రకృతి ప్రతికూలించినా కరవు కాటకాలను ఎదుర్కొంటూనే స్పష్టమైన భవిష్యద్దర్శనంతో కొత్తకొత్త వ్యూహాలతో అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని యనమల చెప్పారు.