రాష్ట్రీయం

పోలీస్ ఖాళీల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

9,281 పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు
హైదరాబాద్, డిసెంబర్ 31: ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌కూ తెరతీసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి, 9,281 కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 1810 సివిల్ పోలీసు కానిస్టేబుల్ పోస్టులు, 2,760 ఆర్మ్‌డ్ రిజర్వుడ్ పోలీస్ పోస్టులు, ఎస్‌ఏఆర్‌సిపిఎల్ అంబర్‌పేట పోలీసు కానిస్టేబుల్ విభాగంలో 56 ఖాళీలు, తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్ విభాగంలో పురుషులకు సంబంధించి 4065 ఖాళీలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 174 పోస్టులు, అగ్నిమాపక శాఖ ఫైర్‌మెన్ విభాగంలో 416 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫారాలను జనవరి 11వ తేదీ నుంచి స్వీకరిస్తారు. అభ్యర్ధులు మీ సేవ, ఇ సేవ, టిఎస్ ఆన్‌లైన్, ఏపి ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు పంపవచ్చు. ఓసిలు, బిసిలకు ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. మూడు సంవత్సరాలపాటు వయోపరిమితి పెంచారు. అర్హత పరీక్షల్లో పరుగుపందేన్ని తీసేశారు. పరుగుపందెం స్ధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఒసిలకు 40 శాతం, బిసిలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీసైనికులకు 30 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. శారీరక ధారుడ్య పరీక్షలో ఐదు ఈవెంట్లలో పురుషులు మూడు ఈవెంట్లలో అర్హత సాధించారు. మహిళలు మూడు ఈవెంట్లలో రెండు ఈవెంట్లలో అర్హత సాధించాలి. అభ్యర్ధులకు పర్సనాలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది తుది రాత పరీక్షలో ఉంటుంది. ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు తెలంగాణ చరిత్రపై రాత పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షకు తెలంగాణ చరిత్ర సబ్జెక్టును చేర్చారు.