రాష్ట్రీయం

ఇక పవర్ పంచశీల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్
ఐదు సూత్రాలు పాటించండి
ఆంధ్ర.. అజేయ శక్తి కావాలి
వీడియో కాన్ఫరెన్సులో సిఎం సూచన

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టేందుకు పంచశీల సూత్రాలు రూపొందించారు. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిశ్రమలకు భరోసా కల్పించడంలో భాగంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఖరారు చేశారు. శుక్రవారం సిఎం చంద్రబాబు ఈ అంశంపై ప్రభుత్వ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే ఎక్స్‌ప్రెస్ ఫీడర్లను నెలకొల్పాలని, పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు, కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కాంల స్థాయిలో సింగిల్ డెస్క్‌ను ఏర్పాటు చేయడం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్ధను నెలకొల్పడం, నిర్ణీత కాలపరిమితిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలను పరిష్కరించడం, విద్యుత్ పొదుపు చర్యలు పాటించి 30 శాతం ఆదా చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. పారిశ్రామిక రంగం ప్రగతికి విద్యుత్ శాఖ ఈ పంచశీల సూత్రాలను అమలు చేయాలని ఆయన నిర్దేశించారు. పరిశ్రమలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్దేశించిన విధివిధానాలను తెలియచేసేందుకు విజయవాడలో పరిశ్రమల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడం, విద్యుత్ సరఫరాలో ఆధునిక టెక్నాలజీని ఈ నగరంలో అనుసంధానించడంపై త్వరలో బ్లూప్రింట్‌ను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ పెట్టుబడులు, వౌలిక సదుపాయాల రంగంలో లక్ష్యసాధనలో ఆంధ్ర 70.12 స్కోరు సాధించిందని, గుజరాత్ తర్వాత దేశంలో రెండో రాష్ట్రంగా నిలిచిందన్నారు. బహుళజాతి కంపెనీలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అనుకూలమైన వాతావరణం ఉందని ప్రపంచ బ్యాంకు విస్పష్టంగా నివేదికలో పేర్కొన్నదన్నారు. విద్యుత్, వౌలిక సదుపాయాల రంగాలను పటిష్టం చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిఎం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేస్తామన్నారు. 21రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఇచ్చిన సూచనల మేరకు పెట్టుబడులు, విద్యుత్ రంగంలో మార్పులు చేస్తున్నామన్నారు. తమ ఫిర్యాదులను పంపేందుకు ప్రత్యేక ఈ-మెయిల్ ఐడిని రూపొందించామని చెప్పారు.