ప్రకాశం

ఒంగోలులో వర్షం ఇబ్బందులు పడ్డ ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబరు 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 5,6 రో జులుగా కురుస్తున్న వర్షాలకు ఒంగోలు నగర ప్రజలతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు ఒంగోలు నగరంలోని నాల్గవ తరగతి ఉద్యోగ భవనం ప్రాంతం తోపాటు బాపూజి మార్కెట్ , రిమ్స్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాలలో సైడుకాలువలలోని డ్రైన్స్ నుండి మురుగు నీరు రోడ్ల పైకి పొంగిపొర్లటంతో ఆయా ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు రోడ్లపై నడవాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. నగర శివారు కాలనీలు అయిన బాలరామకాలనీ , ఎన్ ఆర్ కాలనీ, మోటూరి ఉదయం కాలనీ, కేశవరాజు కుంట , పొనుగుపాటి నగర్ , బాలినేని భరత్ కాలనీ పులి వెంకటరెడ్డి కాలనీ, మారుతీ నగర్, తదితర కాలనీలలోకూడా ఒక మోస్తరుగా వర్షపు నీరు నిల్ల చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా కాలనీలలోని అడ్డరోడ్డులలో సరిగా డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక పోవడంతో కొన్ని రోడ్లపైకి నీరు చేరటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురుస్తుంటంతో కూలీనాలీ పనులు చేసుకోని జీవించే ప్రజలు సరిగా పనులు లేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు లోతట్టు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. ఇదే రకంగా మరికొన్ని రోజులు పాటు వర్షం కురిస్తే మరింత ఇబ్బందుల పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కారణంగా చలిపులి ప్రజలను వణికిస్తుండంతో చలికితట్టుకోలేక ప్రజలు వణికిపోతున్నారు. వర్షాలు ప్రతిరోజూ కరుస్తుండంతో రఘులు, స్వెటర్లు , గొడుగులు, మంకీక్యాపులు, జర్కీన్‌లుకు మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది . దీంతో ఆయా వ్యాపారులు మాత్రం ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే గ్రామీణా ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చేటటువంటి ఉద్యోగులు, వివిధ పనుల మీద వచ్చే టటువంటి ప్రజలు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వ్యవసాయ రైతులకు మాత్రం ఈ వర్షాలు అమృత వర్షంగా భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నగరంలో వర్షాలకు దెబ్బతిన్న డ్రేనేజీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు.
వర్షబాధిత ప్రాంతాల్లో బిజెపి నేతల పర్యటన
ఒంగోలు అర్బన్: నగరంలో గత వారంరోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల్లో శనివారం బిజెపి నేతలు పర్యటించారు. ముందుగా వడ్డెపాలెం, ఏకలవ్యనగర్, ప్రగతికాలనీ, వెంకటేశ్వరకాలనీ తదితర కాలనీల్లో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న గృహాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతోపాటు, డ్రైనేజి వ్యవస్థ మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహరావు, ఖలీఫాతుల్లా బాషా పాల్గొన్నారు.