ప్రకాశం

త్రిపురాంతకేశ్వర ఆలయం రూ. 50కోట్లతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, జూన్ 16: జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన త్రిపురాంతకేశ్వర ఆలయం అభివృద్ధికి 50 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రిపురాంతకేశ్వర ఆలయ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించామని, ఆయన ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధిచేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మార్చేందుకు అంగీకరించారని, 50కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసేందుకు ఆమోద ముద్ర వేశారని అన్నారు. త్రిపురాంతకం ఆలయం గురించి ఎండోమెంటు అధికారులు నివేదిక ఇచ్చారని, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి ఆధ్వర్యంలో త్వరలో ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతంలో నాయకులు, ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధినే మరిచారని, నాయకుల స్వార్థ రాజకీయాల కోసం శ్రీశైలం దేవస్థానం నుంచి త్రిపురాంతకం దేవస్థానాన్ని విభజించారని అన్నారు. త్రిపురాంతకం ఆలయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, దేవస్థానం కింద ఉన్న భూములను క్రమబద్ధీకరించి, అలాగే కేరళ ఆయుర్వేద వైద్యశాల, వైద్యశాలలు ఏర్పాటు, ప్రధాన టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. త్రిపురాంతకం దేవాలయ ట్రస్టుబోర్డును ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి అనుమతితో పాలకమండలిని నియమించనున్నట్లు, రెండునెలల్లో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, చేకూరి ఆంజనేయులు, కంచర్ల సత్యనారాయణగౌడ్, వేగినాటి శ్రీనివాస్, గోళ్ళ వెంకటసుబ్బారావు, వి లింగయ్య, తోట మహేష్‌నాయుడు, షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

‘ఎన్‌టిఆర్ అవాజ్‌యోజన కింద అర్హులకు పక్కాగృహాలు’
దర్శి,జూన్ 16:ఎన్‌టిఆర్ అవాజ్‌యోజన పథకం కింద దర్శి మండలంలోని అర్హులందరికి పక్కా గృహాలు మంజూరు చేయాల్సిందిగా తెలుగుదేశంపార్టీ తీర్మానించినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు నారపశెట్టి పిచ్చయ్య తెలిపారు. శుక్రవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలు ప్రజలందరికి చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపిపి పూసల సంజీవయ్య మాట్లాడుతూ పేద,బడుగు,బలహీనవర్గాల అభివృద్ధికి తెలుగుదేశంపార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తుందని, సంక్షేమపథకాలు ప్రజలకు చేరవయ్యేలా కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్టవ్రేతన సంఘం డైరక్టర్ ఎం శోభారాణి, మండల ఉపాధ్యక్షుడు మారం శ్రీనివాసరెడ్డి, టిడిపి మండలపార్టీ కార్యదర్శి మారెళ్ళ వెంకటేశ్వర్లు, నాయకులు గురవయ్య, ఆకుల వెంకట్రావు, వల్లెపు వెంకటనారాయణ, గుర్రం బాలకృష్ణ, బిసిసెల్ అధ్యక్షుడు గుడూరి బాలగురవయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎ నాగుర్‌వలీ, పార్టీనాయకులు దారం సుబ్బారావు, సందు రామయ్య తదితరులు పాల్గొన్నారు.