ప్రకాశం

సమయం లేదు మిత్రమా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: టిడిపి అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయ మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు జరగనున్నప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో స్థానిక నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మార్కాపురం డివిజన్‌లో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉండగా మాజీ ఎమ్మెల్యే రాంబాబు ఉన్న సమయంలో కంభం పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు కానీ, నియోజకవర్గ కేంద్రమైన గిద్దలూరు ఎఎంసి పాలకవర్గాన్ని నియమించడంలో విఫలమయ్యారు. అనంతరం పరిణామాల్లో ఆయనను ఇన్‌ఛార్జిగా తొలగించి వైకాపా నుంచి గెలిచిన అశోక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఈ ఎఎంసి చైర్మన్ పదవి భర్తీకాలేదు. ఇక మార్కాపురం నియోజకవర్గంలో రెండు పాలకవర్గాలు ఉండగా, మార్కాపురం ఎఎంసి చైర్మన్ పదవిని భర్తీచేసి పదవీ కాలం రెండేళ్ళు ముగిసింది. అయితే పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకోసం టిడిపి నేతలు ఇమ్మడి కాశీనాథ్, శాసనాల వీరబ్రహ్మం, తాళ్ళపల్లి సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే పొదిలి మార్కెట్ యార్డు పదవి భర్తీచేయాల్సి ఉండగా ఇంతవరకు దాని ఊసెత్తిన దాఖలాలు లేవు. ఇక యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒకేఒక ఎఎంసి ఉండగా మూడేళ్ల నుంచి ఐదుగురు ఈ పదవి కోసం పోటీపడుతున్నప్పటికీ త్రిసభ్య కమిటీ ఎవరికి ఈ పదవి ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనని భర్తీ చేసేందుకు వెనుకాడారు. అయితే డాక్టర్ మనె్న రవీంద్ర వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావును నియమించేందుకు ప్రయత్నించినప్పటికీ కొన్ని సామాజిక వర్గాలు తమను కాదని వైశ్యులకు ఎలా ఇస్తారంటూ అడ్డుతగిలి చివరి నిమిషంలో సుబ్బారావుకు పదవి దక్కకుండా అడ్డుపడ్డారు. అయితే ఇక్కడ కూడా త్రిసభ్య కమిటీ రద్దయి వైకాపా నుంచి గెలిచిన డేవిడ్‌రాజు టిడిపిలో చేరి ఏడాది కావస్తున్నా మార్కెట్‌కమిటీ నియామకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైంది. ఈ విషయంపై కార్యకర్తలను అడిగితే ప్రభుత్వానిది తప్పులేదని, స్థానిక నేతలు చొరవ చూపకపోవడంతో జాప్యం జరుగుతోందని, వీరిలా ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో తాము పార్టీ కోసం ఎలా పనిచేయాలని అసంతృప్తితో సమాధానం ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇచ్చి ఉంటే ఒకరి పదవీ కాలం ముగిసి మరొకరికి అవకాశం వచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ తాము జెండాలు మోయాల్సిందేనని, వీరు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు అనుభవించాలని భావిస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని తెలుగు తమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు. పొదిలి మార్కెట్‌యార్డు పదవి కోసం గునుపుడి భాస్కరరావు, శ్రావణి వెంకటేశ్వర్లు పోటీ పడుతుండగా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన భాస్కర్‌రావుకే కట్టపెట్టాలని కార్యకర్తలు చెప్పినప్పటికీ నేత ఆ విషయాన్ని గుర్తించకుండా కాలం గడుపుకొస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు మార్కెట్‌యార్డు పదవి కోసం యాదవులు, నాయుడు పోటీ పడుతుండగా అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవులకు కట్టపెట్టి ఉంటే రెండవ పర్యాయం నాయుడులకు ఇచ్చి ఉంటే ఎలాంటి ఆక్షేపణ ఉండేది కాదని అక్కడి కార్యకర్తలు అంటున్నారు. ఏదిఏమైనా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో స్థానిక నేతల నిర్లక్ష్యం కార్యకర్తల్లో అసంతృప్తి నింపే విధంగా తయారైంది. ఇప్పటికైనా స్థానిక నేతలు కమిటీలను నియమించకుంటే జెండా పట్టుకుని తిరిగే కార్యకర్త కూడా ఎన్నికల్లో కరవయ్యే పరిస్థితి ఈ మూడు నియోజకవర్గాల్లో కనిపించనుంది.