ప్రకాశం

రాష్ట్రంలో సిపిఐ బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 18: రాష్ట్రంలో సిపిఐ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం దేశం, రాష్ట్రంలోని ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలింబిస్తున్నాయని, ఈ ప్రభుత్వాలకు వ్యితిరేకంగా పోరాటాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రైతులు పండించిన అన్నిరకాల పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఆందోళనచేస్తే రైతుల పై అక్కడి ప్రభుత్వం అమానుషంగా కాల్పులు జరిపినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ నుండి మేధాపట్నాకర్ రైతులకు మద్దతుగా యాత్ర చేపట్టారని మేధాపట్నాకర్ చేపట్టిన యాత్రకు ఆలిండియా కిసాన్ సంఘం మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. పాలకులు నిర్లాక్ష్యానికి బలవుతున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారుల హక్కుల పరిరక్షణకు పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈనెల 24,25,26 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ముట్టడికి పిలుపును కూడా ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు అధికారంలోకి రాకముందు స్వామినాధన్ సిఫార్సులు అమలు చేయాలన్నారని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు ఊసే లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వివిధ రూపాలలో దాడులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని గరికపర్రులో దళితులు సాంఘిక బహిష్కరణకు గురికావడం జరిగిందని, అదే విధంగా ప్రకాశం జిల్లాలోని దేవరపల్లిలో దళితుల భూములను అక్కడి ఎమ్మెల్యే నీరు-చెట్టు పేరుతో అక్రమంగా లాక్కుని లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. దళితులపై ఈ దాడులు ఎన్నో జరుగుతున్నాయన్నారు. దీంతో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా 10 వామపక్ష పార్టీలతో కలిసి ఈనెల 31న విజయవాడలో సదుస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దళితులకు అండగా ఉండేందుకే విజయవాడలో సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ఎక్సైజ్‌శాఖ లంచాలు తీసుకోని బెల్టు షాపులు నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన విమర్శించారు. ఇది ఇలా ఉండగా ఉపరాష్ట్ర పతిగా పోటీలో ఉన్న యం వెంకయ్య నాయుడు పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ వాదని, ఇది ఎన్డీఏ కూటమి కాదు అర్‌ఎస్‌ఎస్ కూటమని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం పోటీలో ఉంచిన రాష్టప్రతి కోవింద్, ఉపరాష్టప్రతి పోటీలో ఉన్న వెంకయ్య నాయుడుకు మద్దతు ఇవ్వటం చూస్తే వైకాపా అధినేత జగన్ బిజెపితో పొత్తుకోసం ఆరాటపడుతున్నారన్నారు. ఉపరాష్టప్రతిగా పోటీలో ఉన్న యం వెంకయ్య నాయుడు ని ఓడించి సెక్యులర్ పార్టీలు బలపరిచిన గోపాలకృష్ణను గెలిపించాలని రామకృష్ణ కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఆర్ వెంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

ఒంగోలు,జూలై 18:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా ప్రజలు ఊపిరీపీల్చుకుంటున్నారు. ప్రధానంగా రైతాంగం ఆనందంగా ఉందనే చెప్పవచ్చు. అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడ్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వాతావరణం కూడా చల్లబడటంతో ప్రజలు సేదతీరుతున్నారు. జిల్లావ్యాప్తంగా సరాసరిన 7.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బేస్తవారిపేట మండలంలో సోమవారం రాత్రినుండి మంగళవారం ఉదయం వరకు 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లల్లో ఈవిధంగా ఉన్నాయి.కంభంలో 17.6. సంతమాగులూరులో 17.2, తర్లుపాడులో 16.4, మార్కాపురంలో 15.2, పర్చూరులో 14.2, త్రిపురాంతకంలో 14, అర్ధవీడులో 13.6, కొరిశపాడులో 12.4, చీరాలలో 12.4, యద్దనపూడిలో 12, కారంచేడులో 12, పెద్దారవీడులో 11.4, మార్టూరులో 11.2, వేటపాలెంలో 11.2,కొండెపిలో 10.6, అద్దంకిలో 9.6, జెపంగులూరులో 8.4,చినగంజాంలో 8.4, ఇంకొల్లుల్లో 8.2, దొనకొండలో 8, పొదిలిలో 7.6, హనుమంతునిపాడులో 7.2, కనిగిరిలో 7, పిసిపల్లిలో 6.2, ఒంగోలులో 5.8, చీమకుర్తిలో 5.6, పుల్లలచెరువులో 5.6, తాళ్ళూరులో 5.4,మర్రిపూడిలో 5.2, ముండ్లమూరులో 4.8, కురిచేడులో 4.8, శింగరాయకొండలో 4.6, దోర్నాలలో 4.4, రాచర్లల్లో 4.4, టంగుటూరులో 4.2, కందుకూరులో 4.2, వెలిగండ్లలో 4.2, కొనకనమిట్లలో 4.2, యర్రగొండపాలెంలో 4.2, దర్శిలో నాలుగు, కొమరోలులో 3.8, మద్దిపాడులో 3.4, బల్లికురవలో 3.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గిద్దలూరులో 3.4, పొన్నలూరులో 3.2, కొత్తపట్నంలో మూడు, ఉలవపాడులో మూడు, నాగులుప్పలపాడులో 2.8, సంతనూతలపాడులో 2.6, గుడ్లూరులో 1.8, జరుగుమల్లిలో 1.8, సిఎస్‌పురంలో 1.4, వలేటివారిపాలెం, లింగసముద్రం,పామూరులో ఒక మిల్లీమీటరు వర్షపాతంనమోదైంది.
చిన్నారిని చంపేసిన కసాయి తండ్రి
తాళ్లూరు, జూలై 18 : మండలంలోని మాధవరం గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మాధవరంలో నివాసం ఉండే నాగిరెడ్డి తన కూతురు 9 నెలల చిన్నారిని పొలాల్లోకి తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం విద్యుత్ తీగలను పట్టుకొని తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు నాగిరెడ్డిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్‌లో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా వైద్యులు తెలిపారు. బంధువులతో ఉన్న కలహాలే కారణమని నాగిరెడ్డి భార్య తెలిపింది. సంఘటనా స్థలాన్ని దర్శి సిఐ కెవి రాఘవేంద్ర పరిశీలించారు. ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మహిళ మృతి
చీమకుర్తి, జూలై 18 : చీమకుర్తి మండలంలోని ఎర్రయ్య నగర్‌లో పరిధిలో శ్రీ శ్రీనివాస పాలిషింగ్ యూనిట్‌లో మార్కర్‌గా పనిచేస్తున్న నీరజా సింగ్ (26) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇతను గత రెండు సంవత్సరాల నుండి శ్రీనివాస గ్రానైట్స్ పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తూ ఎర్రయ్య నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. నీరజాసింగ్‌కు ఇంకా వివాహం కాలేదు. విషయం తెలుసుకున్న చీమకుర్తి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు రిమ్స్‌కు తరలించారు.