ప్రకాశం

అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 15 : అగ్రిగోల్డ్ సమస్యను ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించే విధంగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం నాయకులు వి మోజేష్, జి జడ్సన్, ఏ కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్ల నుంచి 40 లక్షల మంది బాధితులు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం చేస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. కాని కమిటీలు, సిఐడి, కోర్టులతో కాలం గడిచిపోతుందే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకుపడక బాధితులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఖాతాదారుల డేటాను వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైతే అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. సిబిఐ ద్వారా సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తే యజమాన్యానికి సహకరిస్తున్న వారి గుట్టు బయటపడుతుందన్నారు. మిగిలిన డైరక్టర్లను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం పాటలు వేసి బాధితులందరికి వడ్డీతో బకాయిలు చెల్లించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.