ప్రకాశం

ఒంగోలు డెయిరీలో తెలుగుతమ్ముళ్ల రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 18:ఒంగోలు డెయిరీలో తెలుగుతమ్ముళ్ల మధ్య రచ్చరచ్చగా మారింది. డెయిరీ ఆవరణ ప్రాంతం ఇందుకు వేదికైంది. తమసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు డెయిరీ ఉద్యోగులు చేపట్టిన రిలేనిరాహర దీక్షలు సోమవారం నాటికి 8వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రిలేనిరాహర చేస్తున్న డెయిరీ టిఎన్‌టియుసి అధ్యక్ష,కార్యదర్శులు కె శ్రీనివాస్, యు బ్రహ్మాయ్యపై డెయిరీ చైర్మన్ అనుచరుడు అల్లం రమేష్ దాడి చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరగటంతోపాటు చొక్కాలు పట్టుకుని కొట్లాడుకున్నారు. నువ్వెంత అంటే నువ్వేంత అంటూ వారి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్బంగా మధ్యవర్తులు జోక్యంచేసుకుని సమస్యను సర్ధుమణింగించారు. ఈ సందర్భంగా ఒంగోలు డెయిరీ మనుగడకోసం, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకోసం, పాలరైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంగోలు డెయిరీ టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో ఈనెల 11వతేదీ నుండి దీక్షలు ప్రారంభం అయ్యాయని శ్రీనివాస్, బ్రహ్మాయ్య తెలిపారు. సోమవారం పలుసంఘాల నాయకులు తమకు మద్దతు తెలియచేశారన్నారు. ఈ పరిస్థితుల్లో డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నిర్లక్ష్య, నిరంకుశ ధోరణిని ప్రశ్నించటంతో చైర్మన్ అనుచరుడు అల్లం రమేష్ తప్పతాగి వచ్చి శిబిరంలో ఉన్న ఉద్యోగులపై దుర్భాలాషలాడి తమపై చేయిచేసుకున్నారన్నారు. తాము సంయమనం పాటించినప్పటికీ తమపై దాడిచేసేందుకే కుట్రపన్ని ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లుగా చొక్కాలు పట్టుకుని దాడికి దిగారన్నారు. ఈ రిలేనిరాహర దీక్షల్లో డెయిరీ ఉద్యోగులు జెదానం, ఏ శ్రీనివాసరావు, ఎం అప్పారావు, డి పుల్లయ్య, జి కొండలరావుతోపాటు వారికుటుంబసభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఒంగోలు డెయిరీకి పూర్వవైభవం తేస్తానని డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఒకపక్క చెబుతున్నారు. మరోకపక్క డెయిరీ ఉద్యోగులు చైర్మన్ మాటలను విశ్వసించకుండా ఆందోళనబాటపట్టారు. రైతులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని డెయిరీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగులకు రెండునెలలనుండి జీతాలు ఇవ్వాలని, రైతులకు తొమ్మిదికోట్లరూపాయల బకాయిలు చెల్లించాలని, ఎల్‌ఐసి, పిఎఫ్‌లు, ఎంప్లారుూస్ సొసైటీ నగదు, ఉద్యోగుల అరియర్స్ చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డెయిరీలో జరిగిన సంఘటనపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా తెలుగుదేశంపార్టీ పెద్దలు జోక్యం చేసుకుని డెయిరీ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఏంతైనా ఉంది. లేనిపక్షంలో ఈసమస్య చిలికిచిలికి గాలివానలా మారే ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు. ఇదిఇలాఉండగా నిరాహర దీక్షలో పాల్గొన్న డెయిరీ ఉద్యోగులపై బయట వ్యక్తి దౌర్జన్యం చేయటంపై ఉద్యోగులు డైయిరీ ఎండికి ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇలాంటి చర్యలు తిరిగి జరగకుండా క్రిమినల్ కేసుపెట్టి, తగిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు ఆ వినతిపత్రంలో విజ్ఞప్తిచేశారు.

వైభవంగా జగన్నాథ రథయాత్ర
*వేలాదిగా పాల్గొన్న భక్తులు *హరేకృష్ణ నామ స్మరణతో మార్మోగిన ఒంగోలు
*రథయాత్రను ప్రారంభించిన దామచర్ల దంపతులు
ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 18 : జగన్నాథ రథయాత్ర సోమవారం ఒంగోలులో వైభవంగా ప్రారంభ మైంది. ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణ రుక్మిణీలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఒంగోలులోని నవభారత్ బిల్డింగ్స్ నుండి మధ్యాహ్న మూడు గంటలకు ప్రారంభమైన రధయాత్ర వేలాది మంది భక్తుల సమక్షంలో రాత్రి తొమ్మిది గంటలకు ఒంగోలు సౌత్ బైపాస్ వద్ద గల బాలాజీ తిరుపతిరావు కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. నవ భారత్ బిల్డింగ్స్ నుండి ప్రారంభమైన రథయాత్ర ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా కర్నూల్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, అద్దంకి బస్టాండ్ సెంటర్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, మస్తాన్ దర్గా సెంటర్, ట్రంకు రోడ్డు, నెల్లూరు బస్టాండ్ నుండి కల్యాణ మండపం వరకు సాగింది. ఈ రధయాత్ర ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్, ఆయన సతీమణి నాగసత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శ్రీకృష్ణ రుక్మిణీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ ఇస్కాల్ టెంపుల్ అధ్యక్షులు పూజశ్రీ చైతన్యప్రభు మాట్లాడుతూ భగవంతుని వద్దకు వెళ్లలేని భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఒంగోలులో ఈ రధయాత్రను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో 500 సంవత్సరాల క్రితం ఈ రథయాత్ర ప్రారంభం అయ్యిందన్నారు. ఒంగోలు ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు హరి భగవాన్ ప్రభు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఒంగోలులో ఈ రధయాత్ర ను ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో రధయాత్ర కొనసాగుతుందన్నారు. ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్ మాట్లాడుతూ భగవంతుని వద్దకు వెళ్ళలేని భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు రథయాత్రను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఇలాంటి యాత్రల వలన అన్నీ వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అనంతరం బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ రుక్మీణీలకు మహా అభిషేకాలు, మహా హారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. రధ యాత్ర కొనసాగినంత వరకు రహదారుల వెంబడి పూల వర్షం కురిపించారు. భక్తులు ఎవరికి వారు భగవంతుడ్ని సెల్‌ఫోన్ ల్లో బంధించేందుకు యువత పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆరు గంటల పాటు కొనసాగిన జగన్నాధ రధయాత్రలో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్థంభించి పోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
జగన్నాధ రథయాత్రను దర్శించుకున్న మంత్రి శిద్దా
జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సోమవారం రాత్రి వచ్చిన జగన్నాధ రథయాత్రలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొన్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా చేపట్టిన రథయాత్రలో జగన్నాధ, బలదేవ, సుభద్ర విగ్రహాలను మంత్రి శిద్దా రాఘవరావు దర్శించున్నారు. ఇస్కాన్ సంస్థకు చెందిన వేదాంత చైతన్య ప్రభు, హరిదత్తా హనుమాన్ ప్రభు, కె ఆంజనేయులు, మురళీ వదన ప్రభు ద్వారా మంత్రి శిద్దా రాఘవరావు హారతిని అందుకున్నారు.
ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో
85 శాతానికి పైగా సంతృప్తి ఉండేలా పనిచేయాలి
*అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి

ఒంగోలు, సెప్టెంబర్ 18 : ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో 85 శాతానికి మించిన సంతృప్తి స్థాయి ఉండేలా చిత్తశుద్దితో పని చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని ప్రకాశం భవనం సిపివో కాన్ఫరెన్స్ హాలులో మీ కోసం కార్యక్రమం అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మీ కోసం, ఎయంయస్, 1100 కాల్ సెంటర్, మీ సేవ అర్జీల పరిష్కారం వివిధ కోర్టు కేసుల విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, జిల్లా కలెక్టర్లకు ర్యాంకింగ్ ఇవ్వనున్నారన్నారు. ప్రజల నుండి అందే అర్జీల సత్వర పరిష్కారానికి రెండు రోజులుగా టెలీ కాన్ఫరెన్స్ లు, రోజు వారీ పురోగతి సమీక్షిస్తున్నామన్నారు. మీ కోసం అర్జీల పరిష్కారంలో 99.16 శాతంతో జిల్లా 3వ స్థానంలో నిలిచి పురోగతి సాధించిందన్నారు. అలాగే 1100 కాల్ సెంటర్ ఎపిసియం కనెక్ట్, కైజాలా లో 68 శాతం నుండి 80 శాతానికి , అలర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో 62 శాతం నుండి 70 శాతానికి చేరుకొని కొంత పురోగతి సాధించామన్నారు. మీ కోసం గడువు దాటిన 645 అర్జీలు త్వరితగతిన పరిష్కరించి జిల్లా ను అగ్ర స్థానంలో నిలపాలన్నారు. ముఖ్యంగా డియంహెచ్‌వో 69, పోలీస్ -297, హౌసింగ్ -85, డిపి -37 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే 1100 కాల్ సెంటర్ లో 320 గడువు దాటిన అర్జీలను సత్వరమే ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలన్నారు. అందు లో ప్రధానంగా పోలీస్ శాఖ -160, డియంహెచ్‌వో -62, హౌసింగ్ -22, డిపివో -8 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అలర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ క్రింద 558 ప్రతికూల వార్తలు రాగా 390 పరిష్కరించారని ఇంకనూ 168 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో ముఖ్యంగా ఎంపిడివోలు -34, డిసిహెచ్‌యస్-5, డిపివో, ఐసిడియస్ -6, డ్వామా, పోలీస్, పంచాయితీ రాజ్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ -3 చొప్పున అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. మీ సేవ అర్జీల్లో ఇంకనూ 8145 అర్జీలు గడువుదాటినవి ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా 4340 ఎస్‌పిడిసియల్ కు చెందినవి కాగా 696-డిఆర్‌వో, 619-జియం, డిఐసి, 419-గనుల శాఖ, 378 - మత్స్యశాఖ , 190-డియస్‌వోకు చెందినవి ఉన్నాయన్నారు. అర్జీలను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సముచిత రీతిలో పరిష్కరించాలన్నారు. లోకాయుక్త, జాతీయ , రాష్ట్ర మానవ హక్కుల సంఘం , హై కోర్టు కేసులకు సంబంధించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కౌంటర్లు దాఖలుకు తగిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా డిపివో, డియస్‌వో, డియంహెచ్‌వో, డి ఆర్‌డి ఏ, గనులు, డియఫ్‌వో, డ్వామా తదితర శాఖలు తగిన శ్రద్ద వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ఎన్ ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, జడ్పి సి ఈవో సాయి కుమారి, డ్వామా పిడి పోలప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడి జయరాం తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
మార్కాపురం, సెప్టెంబర్ 18: మార్కాపురం సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నీలం రోశయ్య (58) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. గుప్తనిధుల తవ్వకాల వ్యవహారంలో పోలీసులు ఈనెల 6వ తేదీన రోశయ్యను అరెస్టు చేయడంతో రిమాండ్ విధించారు. మార్కాపురం సబ్‌జైలులో ఉన్న రోశయ్యకు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో సిబ్బంది ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహిస్తుండగా మృతిచెందాడు.
ప్రొఫెసర్ల బృందంతో పోస్టుమార్టం చేయించాలి
- దళితహక్కుల వేదిక డిమాండ్
మార్కాపురం సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి సోమవారం గుండెపోటుతో మృతిచెందిన నీలం రోశయ్య మృతదేహానికి ఒంగోలులోని రిమ్స్ వైద్యశాల ప్రొఫెసర్ల బృందంతో పోస్టుమార్టం చేయించాలని దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు నీలం నాగేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఏరియా వైద్యశాల వద్ద పాత్రికేయులతో మాట్లాడుతూ రోశయ్య మృతి అనుమానాస్పదంగా ఉందని, ఈ విషయంపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం రోశయ్య మృతిచెందితే సాయంత్రం వరకు బంధువులకు మృతదేహాన్ని చూపకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలు సూపరింటెండెంటును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర దళిత మహాసభ అధ్యక్షులు ఎం జూనియన్, రాష్ట్ర దళిత ఐక్యవేదిక నాయకులు చప్పిడి వెంగళరావు, మాల మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. రోశయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ దళిత హక్కుల సంఘం సందేహాలతో కూడిన వినతిపత్రాన్ని న్యాయమూర్తి పఠాన్ సియాజ్‌ఖాన్‌కు అందచేశారు. ఈసందర్భంగా ఆయన ఏరియా వైద్యశాలకు వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.