ప్రకాశం

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, సెప్టెంబర్ 21: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. ఇంటింటి తెలుగుదేశంలో భాగంగా గురువారం ఉదయం అద్దంకి పట్టణంలోని 17, 18, 19, 20 వార్డుల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పేదలకు ఎన్‌టిఆర్ గృహ పథకం కింద గృహాలు మంజూరు, పెన్షన్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజిలు, గ్రామాల్లో చెక్‌డ్యాంలు, మంచినీటి సౌకర్యం తదితర సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నారని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరారు. పార్టీని పటిష్టం చేసేందుకు గ్రామాల వారీగా తెలుగు తమ్ముళ్లంతా కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కరి పరమేష్, నాగినేని రామకృష్ణ, కుంచాల హనుమంతరావు, బాషా, రాములమ్మ, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే టిడిపి ధ్యేయం
* ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 21 : గ్రామాల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడించారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి కొత్తపట్నం మండలంలోని రంగాయపాలెం, సంకువానిగుంట గ్రామ పంచాయతీల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా సంకువానిగుంటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో విస్తత్రంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో ప్రధానంగా సిసిరోడ్లు, డ్రైనేజి, ఎల్‌ఇడి బల్బులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వాటికి తోడు డ్రైనేజిలు, కల్వర్టులు, ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నామన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రంగాయపాలెం, సంకువానిగుంటలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బలగాని వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి గేనెం సుబ్బారావు, సంకువానిగుంట గ్రామ పార్టీ అధ్యక్షుడు చిడితోటి జెమ్స్, సర్పంచ్ సువార్తమ్మ, బిసి కార్పొరేషన్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ముస్లిం కార్పొరేషన్ డైరక్టర్ షేక్ కపిల్‌బాషా, జిల్లా పార్టీ నాయకులు బొమ్మినేని మురళి, వాయల మోహన్‌రావు, పసుపులేటి సునీత, కుసుమకుమారి పాల్గొన్నారు.