ప్రకాశం

వ్యాపారుల సిండికేట్‌తో పెరగని పొగాకు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 17: జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో పొగాకు వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో పొగాకు ధరలు పెరగటం లేదు. దీంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 120 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలని గుంటూరు పొగాకు బోర్డు లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రం తోపాటు జిల్లాలో కూడా పొగాకు బోర్డు ఇచ్చిన లక్ష్యం మేరకు రైతులు పొగాకు పంటను సాగుచేయటం జరిగింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో నాణ్యతకలిగిన పొగాకు పంట ఉత్పత్తి జరిగింది. పంట ఉత్పత్తి తగ్గటం . నాణ్యత కలిగిన పొగాకు పంట ఉత్పత్తి కావటంతో పొగాకు రైతులకు ఈ ఏడాది మంచి ధరలు వస్తాయని ఆశించారు. అయితే వేలం కేంద్రాల ప్రారంభంలో పొగాకు వ్యాపారులు నాణ్యతకలిగిన పొగాకు ఒక కేజికి గరిష్ట ధర 140 రూపాయలకు పైగా ధర వచ్చేలా ధరలు ఇచ్చి కొనుగోలు చేశారు. దీంతో పొగాకు రైతులు ఈ ఏడాది మంచి ధరలు వస్తాయని ఆశించారు. అయితే వారి ఆశలను ఎంత కాలమో నిలవనీయలేదు. వ్యాపారులు కొద్దిరోజులు మాత్రమే మంచి ధరలు ఇచ్చి కొనుగోలు చేసి ఆ తరువాత వేలం కేంద్రాలలో సిండికేట్ అవుతూ ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇదేమి అని రైతులు, రైతు సంఘాల నాయకులు వ్యాపారులను వేలం కేంద్రాలలో ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్‌ల పై పుర్రె గుర్తు శాతాన్ని 85 శాతం వరకు పెంచాలని కంపెనీలను ఆదేశించడంతో పొగాకు ను అధిక ధరకు కొనుగోలు చేస్తే తాము నష్టపోతామని సాకు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారులు వేలం కేంద్రాలలో పొగాకును కొనుగోలు చేస్తున్నప్పటికి ధరలు మాత్రం ఏమాత్రం పెరగటం లేదు. గతంలో బోర్డు వేలం కేంద్రాలలో నాణ్యత కలిగిన పొగాకు ఒక కేజికి సగటు ధర 140 రూపాయలకు పైగా ధర ఇచ్చిన వ్యాపారులు ప్రస్తుతం అదే రకం పొగాకు 130 రూపాయలు నుండి 135 రూపాయల వరకు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదే నాణ్యత కలిగిన పొగాకు కు ఒకటి , రెండు బేళ్ళకు ఒక కేజికి గరిష్ట ధర 147 రూపాయలు వరకు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ మిగిలిన బేళ్ళకు ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రకంగా వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తే తాము తెచ్చి అప్పులు ఎలా తీరాలని రైతులు వాపోతున్నారు. గత ఏడాది పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఒక్కోక్క బ్యారన్ రైతు సుమారు రెండు లక్షలకు పైగా నష్టపోయి చాలా మంది రైతులు తాము తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కాక ఆత్మహత్యలు చేసుకున్నారని , అదే పరిస్థితి ఈ ఏడాది కూడా నెలకొనే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికే శనివారం నాడు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పలు రైతు సంఘాల నాయకులు కలిసి వేలం కేంద్రాలలో పొగాకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూసి రైతులను ఆదుకోవాలని వినతి ప్రతాల ద్వారా కోరటం కూడా జరిగింది. 100 రోజులలో పొగాకు కొనుగోళ్ళు పూర్తయ్యేలా చూడాలని , పొగాకు కొనుగోళ్ళు ప్రారంభమై రెండు నెలలు గడిసినప్పటికి ఇప్పటి వరకు రాష్ట్రంలో, జిల్లాలో కేవలం 10 శాతం పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాని దీంతో రోజులు గడిచే కొద్ది పొగాకు నాణ్యత
తగ్గి మరింత ధర తగ్గే ప్రమాదం ఉందని కనుక పొగాకు కొనుగోళ్ళను మరింత వేగం పెంచి కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
అదే విదంగా ఈ ఏడాది గత ఏడాది కంటే అధిక ఖర్చున వెచ్చించి నాణ్యత గలిగిన పొగాకును రైతులు ఉత్పత్తి చేశారని కనుక వ్యాపారులు నాణ్యత కలిగిన పొగాకు ఒక కేజికి సగటు ధర 140 రూపాయలు తగ్గకుండా ధర వచ్చేలా చూడాలని రైతులు కోరు తున్నారు.