ప్రకాశం

మనిషి ఎదగాలంటే తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు గ్రామస్థుల సహకారం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యద్దనపూడి, నవంబర్ 12: సమాజంలో మనిషి ఉన్నత స్థితికి ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు గ్రామస్థుల ఆశీస్సులు ఉండాలని సిని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ స్వగ్రామమైన చిలుకూరివారిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరవలి రాఘవ రావును, చిత్రదర్శకుడు అనిల్ రావిపూడిని గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి నాటక రచయిత కందిమళ్ల సాంబశివ రావుఅధ్యక్షత వహించాడు. ముఖ్య అతిథిగా రాష్టస్రమాచార పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఎస్ వెంకటేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా అనిల్ మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరిని కన్నతల్లిని మరవరాదన్నారు. మా నాన బ్రహ్మయ్య 20 ఏళ్లపాటు ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాణికులను గమ్యస్థానానికి చేర్చారని, అదే విధంగా కుటుంబాన్ని కూడా సర్ధుకు వచ్చారన్నారు. అమ్మ పూజలు నా ఎదుగుదలకు దోహద పడ్డాయని నా 12 ఏళ్ల సిని ప్రయాణంలో నేను ఎప్పుడు గ్రామానికి వచ్చిన గ్రామస్థులందరూ నన్ను ప్రోత్సహించి, ధైర్యాన్ని ఇచ్చేవారన్నారు. పుట్టిన ఊరిలో ఇంత ఘన సత్కారం పొందడం నా పూర్వ శుకృతమన్నారు. కళ అనేది ఒక యూనిటీని తీసుకువస్తుందన్నారు . గ్రామానికి వచ్చినప్పుడల్లా పారిశ్రామికి వేత్త పట్ట్భాతో కలిసి గ్రామ అభివృద్ధికి చేపట్ట వలసిన పనులపై చర్చించేవారమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసరఫరాల శాఖ కమీషనర్ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని వ్యవసాయ ఆధారితమైన గ్రామంలో పుట్టి నేడు రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎదిగిన రాఘవరావు, సిని దర్శకుడు అనిల్, మాజి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ పట్ట్భా ముగ్గురు కలిసి నిరూపించారని ప్రశసించారు. సన్మాన గ్రహీత కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరా వు మాట్లాడుతూ 1917లో యద్దనపూడి నుంచి వలస వచ్చి ఇక్కడ మా పూర్వికులు 20 ఇళ్లు నిర్మించుకున్నారని మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి తమ పిల్లలను మంచి చదువులు చదివించుకుని ఎంతో మంది ప్రస్తుతం అమెరికా ఇతర దేశాల్లో స్థిరపడ్డారన్నారు. అనిల్ మా ఊరి కుర్రవాడు అని చెప్పుకోవటం గర్యంగా ఉందన్నారు. తీసిన మూడు సినిమాలు సమాజాన్ని మంచి మెసేజ్ ఇచ్చేవని అన్నారు. కృషి పట్టుదలతో గ్రామానికి మంచి పేరు సంపాదించిపెట్టారని ప్రశంసించారు. చిన్న వ్యాపారంతో ప్రారంభించి ఈ రోజు తిరుమల ఆగ్రోప్రొడెక్ట్సు ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నామని గ్రామాభివృద్ధికి తమ వంతు సహాక సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కరణం హనుమంతురావు గారి జ్నాపకార్థం ఆయన కుమారులు వెంకటకోటయ్య, సీతారామారావులు తమ సొంత నిధులతో రూ. 15లక్షలు వెచ్చించి, తాగునీటి శుద్ధ జల ప్లాంట్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు శుద్ధ జల కేంద్రాన్ని గ్రామానికి అందించిన ఇరువురికి ఘన సన్మానం చేశారు. చిన్నారులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్య క్రమాలు, కందిమల్ల సాంబశివరావు రచించిన పంపకాలు నాటకం గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టి వీరనారాయణ, రఘరామిరెడ్డి, సుభాష్, కోటిరావు, కె శివ, ఆర్ సింగయ్య, కె శ్రీను, కె పద్మారావు, ఆర్ బ్రహ్మయ్య, పి గోవిందు తదితరులు పాల్గొన్నారు.