ప్రకాశం

కలెక్టరేట్ వద్ద రైతుసంఘం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 22: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని అధీకృత అయకట్టుకు వరిపంట సాగుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా అఖిలపక్ష రైతు సంఘాల ఆద్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ధ ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అభివృద్ధివేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షులు చుండూరి రంగారావు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి హనుమారెడ్డి, వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు , ఓపిడి ఆర్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సుధాకరరావు మాట్లాడుతూ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ కింద జోన్-1, జోన్-2లలో కలిపి 4లక్షల 39వేల యకరాల అధీకృత అయకట్టు ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ నియమ నిబంధనల మేరకు అయకట్టుకు మాగాణి పంటలు అయిన వరి పంటకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే గత మూడు సంవత్సరాలుగా కుడికాలువ ద్వారా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. అరకొరగా ఆరుతడులకు నీరిచ్చినప్పటికీ జోన్ -1లోని గుంటూరు జిల్లా వారు అక్రమంగా నీటిని మళ్ళించుక పోయినందున ప్రకాశం జిల్లా ఆయకట్టుకు సక్రమంగా నీరు రాక వరి పంట తోపాటు కంది, మిర్చి లాంటి పంటలు వేసిన రైతులు తమ పంటలను కాపాడుకోలేక పోయినట్లు తెలిపారు. తాగునీటి కోసం నీరు వదిలి సందర్భంలో కూడా ఒంగోలు పట్టణానికి, రామతీర్థం జలాశయానికి నీరు అరకొరగా వదిలి నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం కుడికాలువ అయకట్టులో అరకొర వర్షాలకు సాగుచేసిన పంటలకు మాత్రమే ఆరుతడి నీరు ఇస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఆరుతడి పంటలకు కూడా జిల్లా ఆయకట్టుకు తక్కువుగా నీరు ఇస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో కుడికాలువ క్రింద ఉన్న ఒంగోలు బ్రాంచి కాలువ , అద్దంకి బ్రాంచి కాలువ క్రింద ఆయకట్టు రైతులు పంటలు వేసేందుకు అవసరమైన నీరందక పంటలు సాగుచేసేందుకు వీలుకాక రైతులు ఆందోళన చెందుతున్నట్లు వారు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా మాగాణి కి నీరు వదలనందున ఆయకట్టుకు వరిపంట సాగు లేక తిండి గింజలు కరువై బయట కొనుగోలు చేసి రావాల్సి వస్తుడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పశుగ్రాసానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లో 270 టియంసి ల నీరు ఉందని, 575 అడుగుల నీటి మట్టము ఉందని, ఆయకట్టు రైతులకు పూర్తి సాయిలో నీరు విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు కలెక్టర్ వినయ్‌చంద్‌ను కలిసి అందజేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడికాలువ ద్వారా ప్రకాశం జిల్లాలోని అధీకృత ఆయకట్టుకు మగాణి పంటలకు సాగుకు 40 టియంసి ల నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కుడి కాలువ ద్వారా వదిలిన నీరు ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు చివరి భూముల వరకు చేరే విధంగా చూసేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, జిల్లాలోని ఆయకట్టుకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడికాలువ ద్వారా న్యాయమైన వాటాను రాబట్టేందుకు, జిల్లాలో కాలువ ప్రవేశించు 85/3 మైలు వద్ద 3300 క్యూసెక్కుల నీరు విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సుబాబుల్, జామాయిల్ కర్ర ప్రధాన కార్యదర్శి టివి శేషయ్య, వివిధ రైతు సంఘాల నాయకులు ఆర్ మోహన్, గొల్లపూడి వెంకటేశ్వర్లు, డివిఎన్ స్వామి, జి నరసింహారావుతదితరులు పాల్గొన్నారు.

మారుమూల పల్లెకూ
నెట్ సౌకర్యం కల్పించాలి
- ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,నవంబర్ 22: జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్ కృషి చేయాలని టెలికం అడ్వయిజరీ బోర్డు చైర్మన్, ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక కావేరి హోటల్ సమావేశమందిరంలో జిల్లా టెలికం బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 3జి, 4జి సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. దర్శి ప్రాంతంతోపాటు అదనంగా పొదిలి,పామూరు, గిద్దలూరు, ఒంగోలులోని పలుప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తున్నట్లు సభ్యులకు తెలియచేశారు. నేటికి అర్ధవీడు మండలంలోని యాచవరం, రంగాపురం, వెలగలపాయ, మాగుటూరు, పోతురాజుటూరు,గనే్నపల్లి గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందటం లేదని సభ్యులు తెలిపారు. వెంటనే ఆ సదుపాయం కల్పించాలని ఎంపి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా 2జి, 3జి సర్వీసులను త్రిపురాంతకం మండలంలోని మనే్నపల్లి, వైచెర్లోపల్లి, అగ్రహారం, వైపాలెం మండలంలోని కొలుకుల, సీతా నాగులవరం, వివిధ మండలాల్లోని తుమ్మలచెరువు, పెదారికట్ల, కాకర్ల, తర్లుపాడు, మూగచింతల, పోతవరం, చందలూరు, బోధనంపాడు గ్రామాలకు విస్తరింపచేయాలని సభ్యుల సూచన మేరకు ఎంపి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి,మొగుళ్లూరు, శంకవరం, పెదారికట్ల, ఊళ్ళపాలెం, వల్లూరు సబ్‌పోస్ట్ఫాసుల్లో ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని సభ్యులు సూచన మేరకు అధికారులను ఎంపి కోరారు. పొతకమూరు, రామాయపట్నం, పెరిదేపి, పోస్ట్ఫాసుల్లో ఆన్‌లైన్ సౌకర్యం ఏర్పాటుచేసినా పనిచేయటం లేదని సభ్యులు ఎంపి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే నంద్యాల పోస్టల్ డివిజన్‌లోని దూపాడు, రావిపాడు, వేములకోట, పిటికాయగుళ్ళ, తోకపల్లి, తుమ్మలచెరువు సబ్‌పోస్ట్ఫాసులకు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని ఎంపి అధికారులకు సూచించారు. ఈసమావేశంలో టెలికం జిఎం బి చంద్రసేన అన్ని డివిజన్ల ఇంజనీర్లు, అడ్వయిజరీ కమిటి సభ్యులు అమ్మిరెడ్డి రాంరెడ్డి,రాచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
27న డిసిసి బ్యాంకు చైర్మన్ ఎంపికపై తుది ప్రకటన
చైర్మన్‌గా దామచర్ల పూర్ణచంద్రరావు?
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,నవంబర్ 22: డిసిసి బ్యాంకు నూతన చైర్మన్‌ను ఈనెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఆ రోజున డిసిసి బ్యాంకు చైర్మన్ ఎంపికపై రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి నారాయణ, శాసనసభ్యులందరూ రాజధాని అమరావతిలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన చేత చైర్మన్ అభ్యర్థిని ప్రకటింపచేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రధానంగా నూతన చైర్మన్‌గా దామచర్ల పూర్ణచంద్రరావుపేరునే ప్రకటించే అవకాశం ఉన్నట్లుతెలుస్తొంది. చైర్మన్ రేసులో పూర్ణచంద్రరావుతోపాటు బ్యాంకు డైరెక్టర్ మస్తానయ్య పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికి ఎక్కువమంది పూర్ణచంద్రరావుకే మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు సమాచారం. పూర్ణచంద్రరావు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌కు దగ్గరి బంధువు కావటంతో రాజకీయాలు వేడెక్కాయి. డిసిసి బ్యాంకు చైర్మన్ ఎంపికపై జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు రెండుగ్రూపులుగా విడిపోయి ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో చైర్మన్ ఎంపిక ఒక కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడటంతో ఆ వ్యవహారం ఈనెల 27వతేదీకి వాయిదా పడింది. ఇటీవల చైర్మన్ ఎంపిక వ్యవహారంపై జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు అందరు సమావేశమైనప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం చైర్మన్‌గా దళితవర్గానికి చెందిన కండే శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ఎవరికివారే ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోటీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు తమ కులం కార్డును వాడుకుంటూ ముందుకుపోతున్నారు. ఇటీవల కాలంలో దళిత సంఘాలకు చెందిన నాయకులు అందరూ కండెను కొనసాగించాలని జిల్లాకు చెందిన శాసనసభ్యులు, మంత్రితోపాటు ఇతర నాయకులను కలిసి విజ్ఞప్తి చేయటం జరిగింది. అదేవిధంగా బిసి సంఘాలకు చెందిన నాయకులను తమ కులానికి చెందిన డైరెక్టర్‌ను చైర్మన్‌గా ఎంపిక చేయాలని కోరటం జరిగింది. దీంతో మొదటి నుండి తెలుగుదేశంపార్టీకి వెన్నుదన్నుగా ఉన్నా దామచర్ల పూర్ణచంద్రరావునే నియమించాలనే ఆలోచనలో పార్టీముఖ్యనేతలందరు ఉన్నట్లు తెలుస్తొంది.
గతంలో బ్యాంకు చైర్మన్‌గా ఉన్న ఈదర మోహన్ రాజీనామా చేయటంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. మోహన్ రాజీనామా చేసిన తరువాత చైర్మన్‌గా కండే శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. కాగా వచ్చేసంవత్సరం మొదట్లో రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిఉంది. ఈనేపధ్యంలో అన్నివర్గాల రైతులకు అన్యాయం జరగకుండా రుణాలను మంజూరు చేసే నాయకుడిని ఎంపికచేసేలా రాష్టప్రార్టీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటివరకు డిసిసి బ్యాంకు, ఒంగోలు డైయిరీ వ్యవహరం రాష్ట్ర, జిల్లాపార్టీకి పెద్దతలనొప్పిగా మారింది. పిడిసిసి బ్యాంకు, ఒంగోలు డెయిరీ వ్యవహరం మొత్తం రైతులతో ముడిపడి ఉండటంతో ఆ వర్గం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరెండిటిపై రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిసారించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. మొత్తంమీద ఈనెల 27వతేదీన డిసిసి బ్యాంకు చైర్మన్‌గా దామచర్ల పూర్ణచంద్రరావుపేరును అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తొంది.

పెళ్లిళ్లకూ తప్పని ‘జీఎస్‌టీ’
* మధుర జ్ఞాపకానికి తప్పని పన్నుపోటు
* జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 29వ తేదీ వరకు భారీగా వివాహాలు
* 18 శాతం వడ్డింపులతో నిర్వాహకులపై అదనపు భారం
* అయినా వెనకడుగు వేయని పేద, మధ్యతరగతి కుటుంబాలు
ప్రతిఒక్కరి జీవితంలో మధురానుభూతిగా మిగిలే వివాహ వేడుకలకు జీఎస్‌టీ భారంగా పరిణమించింది. వివాహ సంబంధ సేవలు 18 శాతం వరకు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా పరిధిలో వారంరోజుల వ్యవధిలో జరగబోవు ఆరువేల పెళ్లిళ్ల ఖర్చుకు జీఎస్‌టీ తోడుగా.. ఐదు కోట్ల రూపాయల వరకు అదనపుభారం పడనుంది. ఒకవైపు కష్టమైనా..నష్టమైనా ఉన్నంతలో కార్యాన్ని ఘనంగా చేయాలన్నదే పేద, మధ్యతరగతి వర్గాల ఆలోచన.
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,నవంబర్ 22: ప్రతి ఒక్కరి జీవితం మధురానుభూతిగా మిగిలిపోయే వివాహ వేడుకకు జీఎస్‌టీ భారంగా పరిణమించింది. ఎంత కష్టమైనా..ఎన్ని అప్పులైనా వివాహాన్ని ఉన్నంతలో ఎంతో ఆర్భాటంగా చేయాలని అందరూ భావిస్తారు. జీవితంలో అత్యంత కీలకమైన వివాహ ఘట్టాన్ని జీవితాంతం మధురస్మృతిగా గుర్తుండేలా వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. సాధారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పెళ్లి చేస్తున్నారంటే ఎంతో కొంత అప్పు చేయక తప్పదు. నగదు రూపంలో కాకపోయినా వస్తువులు, ఇతర కొనుగోళ్లు, చెల్లింపులు..ఇలా ఏదో రూపంలో అప్పు చేయడమో, లేక అరువుకు తీసుకురావడమో చేస్తుంటారు. ఇలాంటి వివాహ వేడుకలకు జీఎస్‌టీ భారంగా మారింది. మార్గశిర మాసం ప్రారంభంలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లకు 23, 24, 25వ తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో జిల్లా పరిధిలో భారీగా వివాహాలు జరగబోతున్నాయి. ఈ ముహూర్తాలు గడిచిపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు లేకపోవడంతో పెళ్లి కుదిరిన వారు ఈ ముహూర్తాలలోనే చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ముహూర్తాలలో వివాహం చేసేందుకు వీలుగా చాలావరకు రెండునెలల క్రితమే ఫంక్షన్‌హాల్స్, కేటరింగ్, వివాహ తంతు నిర్వహించే పురోహితులను మాట్లాడుకున్నారు. అవసరమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, వివాహ వేదిక అలంకరణకు డెకరేషన్, విందు భోజనానికి కేటరింగ్ నిర్వాహకులకు ఫొటోలు, వీడియోగ్రఫీకి ఇదివరకే ఆర్డర్లు ఇచ్చేశారు.
ప్రస్తుతం వివాహం చేయాలంటే ఎంతలేదన్నా రూ.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చుకావడం సర్వసాధారణం. పేదలైతే రూ.5 లక్షలు, మధ్యతరగతిప్రజలైతే రూ.15లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. జీఎస్టీ ప్రభావంతో రూ.5 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా మరో లక్ష రూపాయల వరకు ఆర్థికంగా భారం పడుతుండగా, రూ.10 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా రూ.2 లక్షలు, రూ.15 లక్షలకు మించిచే అదనంగా రూ.3 లక్షలు భారం పడుతోంది. బంగారు ఆభరణాలపై 3శాతం జీఎస్‌టీ విధిస్తుండగా, శుభలేఖలపై 12శాతం జీఎస్‌టీ ఉంది. ఫంక్షన్‌హాల్స్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర వివాహ సేవలు 18శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి.