ప్రకాశం

క్రీడలతో క్రమశిక్షణ, మానసిక ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 11:క్రీడల వలన క్రమశిక్షణ, మానసిక ఉత్తేజం ఏర్పాడుతుందని తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఫేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిస్ అండ్ సైన్స్‌స్ కాలేజిలో ఏర్పాటుచేసిన నాల్గవ ఆంధ్రప్రదేశ్ అంతర్‌జిల్లా అండర్ -23, సీనియర్స్ ఫెన్సింగ్ చాంపియన్ షిప్ -2017ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం, కోచ్‌ల నియామకం చేస్తున్నామన్నారు. చరిత్రలో కత్తియుద్ధం రాజ్యాలను జయించేందుకు ఉపయోగించేవారని, ఇది ఇతర దేశాలకు వ్యాప్తిచెందిందన్నారు. ఆధునిక యుగంలో ఒలంపిక్ క్రీడల్లో ఫెన్సింగ్ క్రీడ (కత్తియుద్దం)గా చోటుచేసుకుందని ఆయన వివరించారు. గ్రామీణ క్రీడలైన వాలీబాల్, ఖోఖో, కబాడ్డిలు ఎంతో ప్రఖ్యాత చెందాయని ఒలంపిక్ క్రీడల్లో చోటు సంపాదించుకున్నాయన్నారు.పెన్సింగ్ క్రీడలకు కోచ్‌లు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితులు, తల్లిదండ్రులు క్రీడల పట్ల ఆశక్తిపెంచేలా తమపిల్లలకు అవగాహన కల్పించి ప్రొత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నేటి సమాజ పరిస్దితులు మారాయని, తల్లిదండ్రులు ఆలోచనలు కూడా మారాయని ఆయన గుర్తుచేశారు. టెన్నిస్, బాడ్మింటన్, క్రికెట్ తదితర క్రీడల కోసం సమ్మర్ కోచింగ్ నిర్వహించి క్రీడాకారులకు తగిన శిక్షణ, తర్పీదు అందించటం జరుగుతుందన్నారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతిభా పాటవాలు చూపుతున్నక్రీడాకారులకు మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్‌ను ఇప్పించి జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జాతీయస్ధాయిలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఆర్ధికసహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. జాతీయ స్ధాయిలో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం స్ధలం ఇచ్చి సముచిత రీతిన గౌరవం ఇస్తుందన్నారు. ఇటీవల బాడ్మింటన్ చాంఫీయన్ పి సింధుకు రెవిన్యూడివిజన్ అధికారి క్యాడర్ హోదా కల్పించి,స్ధలం కూడా ఇచ్చే ఏర్పాటుచేసి గౌరవించటం జరిగిందన్నారు. గత రెండునెలల క్రితం కాకినాడలో జాతీయస్ధాయిలో వాలీబాల్ ,కబాడ్డి ,రేసింగ్,పెన్సింగ్ క్రీడలను నిర్వహించటం జరిగిందని తెలిపారు. ఈసందర్బంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ పాత రోజుల్లో కత్తి యుద్దం ఆత్మరక్షణకోసం ఉపయోగించేవారన్నారు. ప్రాన్స్ దేశం దీనిని పెన్సింగ్ క్రీడగా మార్చారని తెలిపారు. రాబోయే మూడు నెలల్లోగా ఒంగోలులో 2.80కోట్లరూపాయలతో నిర్మిస్తున్న మినిస్టేడియం నిర్మాణపనులు పూర్తికాబోతున్నాయని అందులో ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌నిర్వహించుకునే అవకాశం ఉందన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన విద్య ఆత్మరక్షణకు ఈ క్రీడ ఉపయోగపడుతుందన్నారు. ఈక్రీడ ఒలంపిక్స్ స్థానం సంపాదించిందన్నారు.కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావుమాట్లాడుతూ రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు క్రీడారంగానికి మంచి ప్రొత్సాహం అందిస్తున్నారన్నారు.సింగపూర్‌లో 32దేశాల్లోనిర్వహించిన కరాటేపోటీల్లోపామూరునుండి సందీప్ అనే బాలుడు ఇండోనేషియాపై కరాటే పోటీల్లో గెలిచి బంగారు పతకాన్ని సాధించారన్నారు.పెన్సింగ్ క్రీడలకు మంచి ప్రాచూర్యం పొందేలా చూడాలన్నారు. ఆర్గనైజింగ్ కమిటి చైర్మన్ బాలిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నవాంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి మంచి ప్రొత్సాహం అందిస్తున్నారన్నారు. ఎఫ్‌ఏఎపి కోశాధికారి సతీష్ బాబు మాట్లాడుతూ కత్తి యుద్దం క్రీడను యురోపియన్ దేశాల్లో పెన్సింగ్ క్రీడగా రూపాంతరం చెందిందన్నారు. ఈకార్యక్రమంలో జెఎసి కన్వీనర్ ఇమ్మడి సత్యనారాయణతోపాటు 13జిల్లాలనుండి క్రీడాకారులు, పెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వి నాగేశ్వరరావు, కార్యదర్శి ఏ మురళీకృష్ణ, అడహాక్‌కమిటి సభ్యులు కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేస్ ఇంజనీరింగ్ కాలేజిలోనిర్వహించిన వివిధక్రీడల్లోగెలుపొందిన వారికి రాష్ట్ర హోంశాఖమంత్రి చేతులమీదుగా జ్ఞాపికలు అందించారు.