ప్రకాశం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజల భాగస్వామ్యం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 14: స్వచ్ఛ సర్వేక్షణ్ -2018కి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థకు మంచి ర్యాంకు సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ అన్నారు. గురువారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయ ఆవరణలోని ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటుచేసిన స్వచ్ఛత పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 2018 స్వచ్ఛపర్యవేక్షణ్‌లో భాగంగా జాతీయస్థాయిలో ఒంగోలు నగరానికి అత్యుత్తమ ర్యాంకు సాధించటంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛత కార్యక్రమానికి పెద్దపీట వేశారన్నారు. 2022 సంవత్సరంనాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఇప్పటికీ మరుగుదొడ్లు లేని కుటుంబాలు అనేకం ఉన్నాయని, పారిశుద్ధ్యం ఆధ్వాన్నంగా ఉండటం, ప్రజలు బహిరంగ మలవిసర్జన చేయటం, వీటివలన రోగాలబారిన పడుతున్నారని, బహిరంగ మలవిసర్జనలేని భారతదేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం స్వచ్ఛ్భారత్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు దేశప్రధాని పిలుపు మేరకు రాష్టస్ధ్రాయిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నగరంలో మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు పారిశుద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్త, షాపులు, కూరగాయల మార్కెట్‌లాంటి ప్రదేశాల్లోచెత్త ఉత్పత్తి అవుతుందని తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి చెత్త సేకరణ వారికి విధిగా అందచేయాలన్నారు.నగరప్రజలు వీధులు పారిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నగరంలో మంచి సందేశాత్మాక నినాదాలు, ఆహ్లాదకరమైన చిత్రీకరణలాంటివి ముఖ్యమంత్రి ఆలోచనల మేరకుతీర్చిదిద్దుకున్నామన్నారు. నగరంలోని పచ్చదనం పెంపుదల ఏర్పాటు,సెంట్రల్ లైటింగ్, పార్కులు, ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటుచేసుకోవటం జరిగిందన్నారు. నగరంలోని చెత్తను ఎప్పటికప్పుడు తరలించుకుపోవాల్సి ఉందన్నారు. స్వచ్చసరేక్షణ్ కార్యక్రమం 2016, 2017కేంద్రప్రభుత్వం నిర్వహించిందని ఒంగోలు నగరం 2017సంవత్సరంలో జాతీయస్ధాయిలో70వ ర్యాంకు సాధించిందని, 2018సంవత్సరంలో 70వ ర్యాంకునుండి పైకి వెళ్ళేందుకు సమష్టి కృషి అవసరమని ప్రజలందరు పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. స్వచ్చనగరాల ర్యాంకింగ్ మూడుపద్దతులపై ఆధారపడి ఉందని, మనం పరిశుభ్రతపై ఇచ్చే వివరాలు, సర్వేబృందం ప్రత్యేక పరిశీలన, ప్రజల అభిప్రాయాలని తెలిపారు. ఒంగోలునగరం గత రెండుసంవత్సరాల కంటే ఎంతో అభివృద్దిచెందిందని, ప్రతివార్డులో వౌళిక వసతుల కల్పన, డ్రైన్స్,అంతర్గత రోడ్లు, పారిశుద్యం, తాగునీటి సరఫరా లాంటివి చేపట్టామన్నారు. నగరంలో పెనుమార్పులు వచ్చాయని దీనిని కొనసాగించాలన్నారు. అందరి ఆలోచనల మేరకు ఒంగోలు నగరం క్లీన్ అండ్ గ్రీన్ సాధించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈసందర్బంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాల్లో ఒంగోలు నగరంలో అనేక అభివృద్దికార్యక్రమాలు చేపట్టి అనేక మార్పులు తీసుకురావటం జరిగిందన్నారు. పట్టణంలో డ్రైనేజి వ్యవస్ధను మెరుగుపర్చామని,
వర్షం వస్తే ఇళ్ళల్లోకి నీరు రాకుండా డ్రైనేజిలను ఎప్పటికప్పుడు శుభ్రం చేశామని ఈసందర్బంగా తెలిపారు.నగరంలోని ప్రజలందరు అవగాహనతో వ్యవహరించినప్పుడు స్వచ్చఒంగోలు సాధ్యవౌతుందన్నారు. నగరాభివృద్దిలో పురప్రముఖులు అభిప్రాయాల తోడ్పాటుతో అనేక కార్యక్రమాలను చేపట్టడటం జరిగిందన్నారు. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అందుకు రాజకీయాలకు అతీతంగా కృషిచేయాలన్నారు. ఒంగోలు నగరానికి కేంద్రప్రభుత్వ పధకం మంజూరైందని, 164కోట్ల రూపాయలతో పైపులైను పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, దీని ద్వారా నగర ప్రజలకు త్వరలో ప్రతిరోజు తాగునీరు అందించే ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. నగర ప్రజలందరు బాగుండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. స్వచ్చతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రంగాల్లో ఏనిమిది మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించామని వారు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత నెలరోజులుగా వివిధ సంస్ధలు,పాఠశాలలు, ప్రార్ధనస్ధలాలు, కాలనీలు, పార్కులు, అంగన్‌వాడి కేంద్రాలు, హోటల్స్‌లో స్వచ్చతపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లాకలెక్టర్ , ఒంగోలుశాసనసభ్యులు జ్ఞాపిక, సర్ట్ఫికేట్లను పంపిణిచేశారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్ధ కమీషనర్ ఎస్ వెంకటకృష్ణ అధ్యక్షతవహించి మాట్లాడారు. సమావేశంలో ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు,ఆళ్ళవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్చపర్యవేక్షణపై , మూడు బుట్టలవిధానం అమలుపై ప్రచురించిన కరపత్రాలను జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్,నగరపాలక సంస్ధ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ ఆవిష్కరించారు.

చంద్రబాబు నిర్ణయాలతో
ఒత్తిడికి గురౌతున్న శాసనసభ్యులు, ఇన్‌చార్జులు

ఒంగోలు, డిసెంబర్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలోని కొంతమంది శాసనసభ్యులు, ఇన్‌చార్జులు ఒత్తిడికి గురౌతున్నారు. ప్రజలతో మమేకం అవుతూనే మరోపక్క అభివృద్ధి పనులు చేయాలని, అదేవిధంగా పనితీరు బాగాలేకుంటే రానున్న ఎన్నికల్లో టిక్కెట్లకు ఎసరు జరుగుతుందని వీడియోకాన్ఫరెన్స్‌ల్లో, ముఖ్యమైన సమావేశాల్లో చంద్రన్న హెచ్చరికలు జారీచేస్తుండటంతో తెలుగుతమ్ముళ్లకు మింగుడుపడని అంశంగా మారింది. అదేవిధంగా మీ వ్యాపారాలు మీరు చూసుకుంటూనే పార్టీని బలోపేతం చేస్తూనే మరోపక్క పార్టీని, అభివృద్ధిని చూసుకోవాలని చంద్రన్న ఒకపక్క హెచ్చరిస్తూనే మరోపక్క హితబోధ చేస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈనేపధ్యంలో జగన్ పాదయాత్రపై తెలుగుతమ్ముళ్లు దుమ్మెత్తిపోస్తూనే మరోపక్క రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. కాగా, 2019 సంవత్సరంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటినుండే మరింతగా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రన్న పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఇదిలాఉండగా గ్రామాల్లో ఎక్కువశాతం మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారిగా తయారుచేయాలని, అప్పుడే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని, ప్రతి ఇంటికీ రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సహకారం అందాలని పార్టీశ్రేణులకు ఆదేశాలు జారీచేశారు. ఈనేపధ్యంలో తెలుగుతమ్ముళ్ళు తమ వ్యాపారాలు చూసుకోవాలా, లేక నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి పనులు చూసుకోవాలా, పార్టీకార్యకర్తల సంక్షేమం చూసుకోవాలా అన్న మీమాంసలో జిల్లాలోని కొంతమంది తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశంపార్టీ కార్యక్రమం సక్రమంగా జరుపుతున్నారా, లేదా అనే అంశాలపై కూడా చంద్రన్న ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదిలాఉండగా శాసనసభ్యుల పనితీరుపై చంద్రబాబు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఈసర్వేలో ఏ ఒక్కరికీ ఏగ్రేడ్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. శాసనసభ్యులు, ఇన్‌చార్జుల పనితీరుపై సర్వేలు చేసి వారి ప్రగతికి గీటురాయిగా టిక్కెట్లు కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో తమకు టిక్కెట్లు వస్తాయో, రావో అన్న సందిగ్ధంలో తెలుగుతమ్ముళ్ళు ఉన్నారు.
కాగా, వచ్చేనెలలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ప్రతిసారీ జన్మభూమి సమావేశాలు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాల్లో వచ్చిన సమస్యలే మళ్ళీ జనవరిలో జరిగే సమావేశాలకు రానున్నాయి. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి, అవినీతిని నిర్మూలించగలిగితే చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లవుతుందన్న వాదన ఆపార్టీ నేతలనుండే వినిపిస్తోంది. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా రెవెన్యూ సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈసమస్యలపై జిల్లాలోని అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆ కుమ్ములాటలకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో తెరదించటంలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆ ప్రభావం ప్రధానంగా అద్దంకి, చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలోని తెలుగుతమ్ముళ్ళు బెంబేలెత్తిపోతున్నారు.

టీడీపీతోనే రహదారుల అభివృద్ధి : కందుల
మార్కాపురం టౌన్, డిసెంబర్ 14: తెలుగుదేశం ప్రభుత్వంలోనే రహదారుల అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 10వ వార్డులో మూడు సిసిరోడ్లు, కాలువలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు, ప్రత్యేక నిధులతో మార్కాపురం మున్సిపాలిటీలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తాజాగా 10వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు 7.40లక్షల రూపాయలతో సిసిరోడ్డు, 6.35లక్షల రూపాయలతో పొట్టి యలమంద ఇంటి నుంచి శివ సుబ్రమణ్యం ఇంటివరకు సిసిరోడ్డు, అలాగే మురారి అల్లూరయ్య ఇంటి నుంచి ఎస్సీ, బీసీ కాలనీలోని మున్సిపల్ పాఠశాల వరకు 9.45 లక్షల రూపాయల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సిసిరోడ్డు, సైడ్‌కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వక్కలగడ్డ మల్లిఖార్జున్, మైనార్టీ నాయకులు షేక్ బాదుల్లా, కౌన్సిలర్లు కనిగిర బాలవెంకటరమణ, చప్పల్లి ఆంజనేయులు, పేరూరి భాస్కర్, ఆదాం సాహెబ్, నాలి కొండయ్యయాదవ్, మదార్‌వలి తదితరులు పాల్గొన్నారు.