ప్రకాశం

వృత్తి శిక్షణతోనే యువతకు ఉపాధి అవకాశాలు మెండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 26: వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఉంటేనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒంగోలు పార్లమెంట్‌సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కాపుకల్యాణమండపంలో ప్రధానమంత్రి కౌసిక్ వికాసయోజన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్కిల్ డెవలప్‌మెంట్ శాఖను అందుకే ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జిల్లాలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సింక్రోసర్వ్ సంస్థల ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణాకార్యక్రమాలు జరుగుతాయన్నారు. బ్యాంకింగ్, సోలార్, టెక్నిషియన్, ఇంగ్లీషు అండ్‌లైఫ్‌స్కిల్ కంప్యూటర్ బేసిక్, ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి గుర్తించిన కోర్సుల్లో కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ శిక్షణాకార్యక్రమంలో చేరినవారు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు కూడా తెలియచేయాలన్నారు. ఇప్పటికే సింక్రోసర్వేవారు ఒంగోలులో లాబిస్టిక్స్ కొమరోలులో బిల్డ్రింగ్స్ కనస్ట్రక్చన్‌లో శిక్షణపొందిన 170మందికి ఒంగోలు ఎంపి వైవి సర్ట్ఫికెట్లను అందచేశారు. ఈకార్యక్రమంలో ఐఎల్‌అండ్ ఎఫ్‌ఎస్ తెలంగాణా, ఆంధ్రా ప్రతినిధి పిఆర్‌వి కృష్ణన్, సింక్రోసర్వ్ డైరెక్టర్ ఐ మనోజ్‌కుమార్, ఎన్‌ఎస్‌డిసి ఎలాజిస్టు ఆశీస్‌బాత్రా, అనన్య ఐటి సోల్యూషన్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.