ప్రకాశం

కాపు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, జనవరి 23: కాపులను బీసీ జబితాలో చేర్చి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ను చట్టం రూపంలో వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఇటీవల నెల్లూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న జిల్లా కాపునాడు అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములును పందిళ్లపల్లి లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఆయన పరామర్శించారు. స్వాములు త్వరగా కోలుకుని కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా 6 నెలల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లకు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయించడం సంతోషదాయకమన్నారు. తహశీల్దార్ కార్యాలయాల్లో కాపులకు బీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసినప్పుడే కాపు జాతి పూర్తిగా సంతృప్తి చెందుతుందన్నారు. కాపులను బీసీ ఎఫ్ కేటగిరిలో చేర్చడం వల్ల రాష్ట్రం లోని 14 వర్శిటీల్లో 700 మంది కాపు విద్యార్థులకు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో 50వేల మందికి తక్షణ ప్రయోజనం చేకురుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో చట్టం రూపంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి రంగాలతో పాటు రాజకీయాల్లోనూ రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేతో పాటు విశ్రాంత ఎ ఎస్పీ సుంకర సాయిబాబ, రాష్ట్ర, జిల్లా కాపునాడు నేతలు ఆకుల రామకృష్ణ, గొర్రెపాటి శ్రీనివాసరావు, వాసిరెడ్డి దాసు, మిరియాల సుబ్బారావు, గుండా రమణ, తాతాజి, స్థానిక టిడిపి నేతలు, కాపు నాయకులు పాల్గొన్నారు.