ప్రకాశం

పార్టీ పటిష్టతపై బాలినేని ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 15: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన పాదయాత్రను జిల్లాలో పూర్తిస్థాయిలో విజయవంతం చేసేపనిలో మాజీమంత్రి, వైకాపా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తలమునకలుగా ఉన్నారు. తొలిరోజు శుక్రవారం కందుకూరు నియోజకవర్గంనుండి జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్‌చార్జ్ తూమాటి మాధవరావుతో కలిసి పర్యవేక్షించారు. అదేవిధంగా జగన్ పాదయాత్ర నిర్వహించే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలను నిర్వహించారు. మీడియా సమావేశానికి సైతం జగన్ పర్యటించే నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సమిష్టిగా హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో తన రాజకీయ చతురతతో అక్కడి నాయకులు సైతం పార్టీతో మమేకయ్యేలా చేయటంలో బాలినేని సఫలీకృతులయ్యారు. ప్రధానంగా దర్శి నియోజకవర్గ రాజకీయంపై కూడా ఆయన దృష్టి పెట్టారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదురెడ్డిని జగన్‌తో కలిపే ఏర్పాట్లు చేశారు. దీంతో జగన్ బూచేపల్లికి రాజకీయంగా భరోసా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చీమకుర్తిలో జరిగే పాదయాత్రను సైతం విజయవంతం చేయాలని బూచేపల్లికి జగన్ సూచించారని పార్టీవర్గాల సమాచారం. జగన్ పర్యటన ద్వారా ఆ నియోజకవర్గంలో కూడా గ్రూపు రాజకీయాలకు త్వరలో తెరదించాలని బాలినేని వ్యూహత్మాకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేసిన సమయంలో జిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర జరిగింది. ఆ ఓదార్పు యాత్రను పూర్తిస్ధాయిలో విజయవంతం చేయటంలో బాలినేని సఫలీకృతులయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆదిమూర్తిపల్లి నుండి ప్రారంభమైన జగన్ ఓదార్పుయాత్రను జిల్లా సరిహద్దు తడవరకు బాలినేని ఏలాంటి లోటుపాట్లు లేకుండా సాఫీగా నడపగలిగారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జరపుతున్న యాత్రను పూర్తిస్ధాయిలో విజయవంతంగా జరిగేలా చూడాలని బాలినేనికి అధినేత జగన్ సూచించిన నేపథ్యంలో బాలినేని జిల్లాలో జరిగే యాత్రను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని సక్సెస్ చేసేపనిలో నిమగ్నమై ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించటంలో సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో తనకున్న రాజకీయ అనుభవంతో మళ్లీ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు, జిల్లాలో పార్టీని పూర్తిస్థాయిలో పటిష్టం చేసేపనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే తరుచుగా ఒంగోలులో బాలినేని తిష్టవేస్తూ తన నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెడుతునే మరోకపక్క జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పురోభివృద్దిపై ఎప్పటికప్పుడు నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు పోతున్నారు. జిల్లాలోని సమస్యలను ఎప్పటికప్పుడు జగన్‌కు బాలినేని చేరవేస్తున్నారు. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం, రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక హబ్, నిమ్జ్, ఫ్లొరైడ్ సమస్యలతోపాటు పలు అంశాలపై జగన్ ప్రత్యేకదృష్టి సారించి తన ప్రసంగాన్ని సాగించనున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. జగన్ చేపట్టిన పాదయాత్ర జిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గాలు మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల ద్వారా సాగనుంది. ఈ నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలపై కూడా జగన్ మాట్లాడే అవకాశాలున్నాయి. జగన్ పాదయాత్రలో జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.