ప్రసాదం

అంతా రామమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రామతత్వం జీవతత్త్వంగా, జీవన తత్త్వంగా జీవిత తత్త్వంగా ప్రతి మనిషిలోను, మనసుల్లోను పరిమళించి పరిమళాలు వెదజల్లితే- అంతా రామమయమే’’ అన్నాడో మహనీయుడు.
జీవన తత్త్వానికి అవతారతత్త్వాన్ని సమన్వయం చేసిన లోతైన అద్వితీయ సందేశాత్మక ప్రబోధమిది.
మాటలలో చేతలలో నడకలో నడతలో ధ్యాసలో, శ్వాసలో, జీవితంలోని అడుగడుగునా, అణువణువునా మనం సత్యమయం కావాలి. ‘్ధర్మమయం’ కావాలి. ‘కర్తవ్యమయం’ కావాలి. ‘తేజోమయం’ కావాలి. ‘ప్రేమమయం’ కావాలి. వెరశి- జగత్తు అంతా అప్పుడు ‘‘రామమయం’’ అవుతుందని దీని భావం.
రామరావణ సంగ్రామం అయిపోయింది. సీతా, లక్ష్మణ సమేతుడై రాముడు అయోధ్యకి వస్తున్నాడు. అప్పుడు శ్రీరాముడికి ఓ సందేహం కలిగింది. భరతునితో పద్నాలుగు సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాముడు అయోధ్యకి వెళ్తున్నాడు. పద్నాలుగు ఏళ్లలో భరతుని మనసు ఏమాత్రమైనామారి ఉంటే రాముడు అయోధ్యకి వెళ్లడం ధర్మం కాదు. భరతుడి మనసు మారి ఉండవచ్చు కదా అనేదే రాముని సందేహం. సందేహ నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. విషయం తెలుసుకోమని, తెలుసుకునే పనిని హనుమంతునికి అప్పజెప్పాడు శ్రీరాముడు.
హనుమంతుడు భరతుని దగ్గరకి వస్తాడు. అంతా పరీక్షిస్తాడు. పరిశీలిస్తాడు. శ్రీరాముని దగ్గరికి వస్తాడు హనుమ. ‘‘రామయ్యా! అక్కడ కూడానాకు రాముడే అంతా కనిపించేడయ్యా. అంతా రామమయమై ఉందయ్యా’’ అని రామునికి చెప్తాడు.
హనుమంతుడుకి అక్కడ అంతా రామమయంగా కనిపించినప్పుడే భరతునికి ఆస్థిత్వమే లేదు. భరతునికి అస్థిత్వమే లేనప్పుడు, భరతునికి కోరిక ఎక్కడుంటుంది?
జగత్తంతా రామమయం అవడం అంటే ఇదే!
‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’
ధర్మానికి ఓ ఆకారం వచ్చినట్టయితే ఆ ఆకారమే శ్రీరాముడు. ‘‘్ధర్మం’’ అంటే ఏమిటి? ఏది ధర్మం?’’ ఇతరులు నీకు ఏది చేస్తే, నీకు అది సంతోషమవుతుందో, ఉపకార మవుతుందో నువ్వు ఇతరులకు అదే చేయటం ధర్మం.
ఇతరులు నీకు ఏది చేసినట్లయితే నీకు కష్టం అవుతుందో, అపకారం అవుతుందో, అది నువ్వు ఇతరులకి చేయకపోవడమే ధర్మం’’ అనంటారో మహనీయుడు. శ్రీరాముడు చేసినదంతా ధర్మం. శ్రీరాముడు చేయనిదంతా అధర్మం’’ అని కూడా అంటాడా మహనీయుడు.
ఓ గురువు దగ్గరకి ఓ శిష్యుడు వచ్చేడు. ‘‘నాకు మహ మంచివాడిగా, ధర్మపరునిగా మారిపోవాలని ఉంది. ఉపాయముంటే చెప్పండి గురువర్యా’’ అని అడిగేడు. దానికి గురువు గారన్నారు.. ‘‘నాయనా! అదంత కష్టమైన పనేం కాదు. సులభమైనదే. నువ్వో పని చెయ్యి. ఈ క్షణం నుంచి నువ్వు ‘‘శ్రీరాముడి’’లా మారిపో’’ అని వాత్సల్యంగా చూసేరు.
ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కనిపిస్తుంది. అయితే శ్రీరామునిగా మారడం, మారిపోవటమూ ఆచరణలో ఎంత కష్టమో మాటలలో చెప్పలేం. ఊహించటానికి కూడా అందనంత కష్టమైన పని అది. అంతటి కష్టమైన దానిని కూడా మహా ఇష్టంగా ఆచరించి చూపిన అవతార పురుషుడు శ్రీరాముడు!
అందుకే మనం శ్రీరాముణ్ణి అంతగా కొలుస్తున్నాం. కొనియాడుతున్నాం. ఇలవేల్పుగా పూజిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం.
ఇక కర్తవ్య దీక్ష. ఓ కొడుకుగా, ఓ భర్తగా, ఓ అన్నగా, ఓ చక్రవర్తిలా- ఇలా తాను ఏ పాత్రలో ఉంటే, ఆ పాత్రకి సంబంధించిన కర్తవ్యాన్ని ఆదర్శప్రాయంగా నిర్వర్తించిన ధర్మమూర్తి. అనంత గుణ సంపన్నుడు శ్రీరాముడు.
‘‘మనిషి తన కర్తవ్యాన్ని నిండు హృదయంతో, స్వచ్ఛందంగా నిర్మలంగా, నిష్ఠతో, దీక్షతో నిర్వర్తించాలి’’ అనే బోధని తన జీవనం ద్వారాలోకానికి చాటి చెప్పిన అవతార మూర్తిత్త్వం శ్రీరామునిది.
‘రామావతార అవతార మూర్తిత్త్వం’ మనకి స్ఫూర్తివంతం కావాలి. దీప్తివంతం కావాలి. మూర్తివంతం కావాలి.
అప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కాంతివంతమవుతుంది. నిత్యవంతమవుతుంది. సత్యవంతమవుతుంది. సర్వం ‘ప్రేమమయమై’ జగత్తు అంతా ‘‘రామమయం’’ అవుతుంది.
*

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669