ప్రకాశం

ఉపాధి కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థవీడు, మార్చి 23: మండలంలోని బొల్లుపల్లి గ్రామానికి చెందిన మాచారపు చిన్నక్క (70) శుక్రవారం ఉపాధిహామీ పనికి వెళ్ళింది. గ్రామానికి సమీపంలోని తిమ్మని చెరువులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన తోటి కూలీలు ఆమెను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపిడిఓ సుకుమార్, ఇసి కిశోర్, ఎపిఓ మాల్యాద్రి చిన్నక్క మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలకై కృషి చేస్తామని తెలిపారు.