ప్రకాశం

హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 28 : ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ఎక్కువగా హెల్మెట్ ధరించని కారణంగా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో ప్రమాదాల వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 90 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అతివేగంగా వాహనాలు నడపటం వల్ల జరిగిన ప్రమాదాలలో జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 43 మంది మృతి చెందినట్లు ఎస్‌పి తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు మితిమీరిన వేగంతో కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరు హెల్మెట్ ధరించి ఉంటే వారి కుటుంబ సభ్యులకు దుఖం మిగిలి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు అక్కడ రోడ్డుకు సంబంధించి ఎటువంటి ఇంజనీరింగ్ లోపం కనిపించలేదన్నారు. కేవలం వాహనాలను వేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు ఎస్‌పి తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసుశాఖ తెలిపిన సూచనలను పాటించి సహకరించాలని ఎస్‌పి శ్రీకాంత్ కోరారు.