ప్రకాశం

ప్రకాశం పంతులు స్ఫూర్తితో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 20: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరు ముందుకు సాగాలని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రకాశం భవన్‌లోని ప్రకాశం పంతులు 61వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కాంస్యవిగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం పంతులు పేదకుటుంబంలో జన్మించి బారిష్టరుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తిగా కీర్తించారు. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగి పోరాడి ఆంధ్రకేసరిగా బిరుదు పొందారన్నారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్‌పార్టీలో కీలకమైన పదవులు అధిరోహించారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకోవాలని సూచించారు. జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు జిల్లాలో జన్మించి ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత విద్యనభ్యసించారన్నారు. స్వాతంత్ర సమరంలో కీలకమైన పాత్రపోషించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారని, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ పోలీసు వారి తూటాకు ఎదురు నిలబడి కాల్చండి అని ధైర్యసాహసం చేసిన వ్యక్తిగా ఆయన కొనియాడారు. 1953సంవత్సరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అన్ని రంగాల్లో మంచిసేవలు అందించారన్నారు. జిల్లా శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకాశం పంతులు వివిధ హోదాల్లో పనిచేశారని గుర్తుచేశారు. ప్రకాశం పంతులు జన్మించిన ఈ గడ్డపై తాను పార్లమెంటు సభ్యునిగా పనిచేశారని తెలిపారు. ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం పార్లమెంటులో అప్పటి స్పీకర్ బాలయోగి సహకారంతో పంతులు చిత్రపటాన్ని ఉంచడం జరిగిందన్నారు. ప్రకాశం పంతులు ఉన్నత చదువులు చదివి, కుటుంబాన్ని వదులుకుని దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవటం మన అదృష్టమన్నారు. ప్రకాశం పంతులు నిస్వార్థ జీవితం గడిపారని ఈతరం వారు ఆయన్ను గుర్తుచేసుకోవాలని సూచించారు. తొలుత ప్రకాశం భవనంలోని ప్రకాశం పంతులు కాంస్యవిగ్రహానికి మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్, ఎంఎల్‌సి కరణం బలరాం, జెసి -2 డి మార్కండేయులు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణతోపాటు ఒంగోలు తహశీల్దార్ చిరంజీవితోపాటు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.