ప్రకాశం

వైద్యం.. ఇక్కడ గగనం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, మే 3: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటున్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాల రెఫరల్ వైద్యశాలగానే మిగిలిపోయింది. పశ్చిమప్రాంత డివిజన్ కేంద్రంలో పెద్దదిక్కుగా ఉన్న ఈ వైద్యశాలకు మార్కాపురంతోపాటు గిద్దలూరు, కంభం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, అర్థవీడు మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజూ 500కుపైగా ఓపి ఉంటుంది. అలాంటి ఈ వైద్యశాల గత కొనే్నళ్లుగా అరకొర వైద్యసిబ్బందితో కాలం వెళ్లదీస్తుంది. ప్రభుత్వం అందించే మందులు కూడా గత ఐదునెలలుగా సక్రమంగా అందకపోవడంతో రోగులు బయటి నుంచి మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాలవంతమైన స్థలం, అధునాతన పరికరాలు ఉన్న ఈ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్యనిపుణులు, మత్తువైద్యుడు, దంతవైద్యుడు, ఎముకల వైద్యుడు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమప్రాంత డివిజన్‌కేంద్రంగా ఉన్న ఈవైద్యశాలకు మారుమూలప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా క్షతగాత్రులను తీసుకువస్తుంటారు. సకాలంలో స్పందించి చికిత్సలు నిర్వహించాలంటే సంబంధిత వైద్యులు లేకపోవడంతో కేవలం ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించి దూరప్రాంతాలైన ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, కర్నూలుకు అత్యవసర చికిత్సల నిమిత్తం తరలిస్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. వైద్యవిధాన పరిషత్ వైద్యశాలగా ఉన్న ఈ వైద్యశాలను జిల్లావైద్యశాలగా మార్చి అన్ని వసతులు సమకూర్చాలని ప్రజలు, రాజకీయ ప్రముఖులు కోరుతున్నారు. ఈమేరకు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంబంధిత నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపారు.
శస్తచ్రికిత్సలకే జనరేటర్ వినియోగం
లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన జనరేటర్‌ను శస్త్ర చికిత్సల సమయంలో తప్పా ఇతర విద్యుత్‌కోతల వేళల్లో వినియోగించకపోవడంతో ఇన్‌పేషెంట్లుగా ఉన్న బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు చీకట్లో మగ్గుతూ ఉక్కపోతకు గురవుతున్నారు. ప్రభుత్వం జనరేటర్ వినియోగం కోసం ఇస్తున్న నిధులు చాలీచాలనంతగా ఉంటుండటంతో కేవలం శస్తచ్రికిత్సలు, ఇతరత్రా అత్యవసర వేళల్లో మాత్రమే వినియోగిస్తున్నామని వైద్యశాల సూపరింటెండెంట్ చెబుతున్నారు. వైద్యశాలలో ఆర్వోప్లాంట్ ఉన్నా దానిపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రోగులు దాహార్తి తీర్చుకునేందుకు పలు అవస్థలు పడుతున్నారు. లీటర్ల లెక్కన నీటిని కొనుగోలుచేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి సుస్తి చేసిన ప్రభుత్వ వైద్యశాలలో అన్నిసౌకర్యాలు సమకూర్చి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.