ప్రకాశం

తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 26: జిల్లాలోని ఎక్కువ శాతం మంది తెలుగుదేశంపార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు,కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికార పగ్గాలు చేపట్టి నాలుగుసంవత్సరాలు పూర్తిచేసుకుని ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. కానీ ఎన్నికలు దగ్గరపడే కొద్ది జిల్లాలోని ముఖ్యమైన నాయకులు,ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తులు వెళ్లగక్కుతున్నారు. శుక్రవారం జరిగిన తెలుగుదేశంపార్టీ జిల్లా మహానాడును వేదికగా చేసుకుని కొంతమంది ముఖ్యమైన నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ఎక్కువశాతం మంది అసంతృప్తిలో ఉన్నారని ప్రకటించారు. ఆ నాయకులు ప్రసంగించిన సమయంలో పార్టీక్యాడర్ చప్పట్లతో హోరెత్తించింది. దీన్ని బట్టిచూస్తే ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ, ప్రభుత్వంపై ఎంత అసహనంగా ఉన్నారో ఇట్టే అర్ధవౌతుంది. ప్రధానంగా గ్రామ,మండలస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తుల్లో ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. పార్టీకి గ్రామ, మండలస్థాయి నాయకులే ఎన్నికల సమయంలో కీలకం. కాని అలాంటి వారిని కొంతమంది శాసనసభ్యులు పట్టించుకోవటం లేదన్న వాదన వినిపిస్తోంది. మండల స్థాయిలోని అధికారులు సైతం నాయకులకు,కార్యకర్తలకు సక్రమంగా పనులు చేయకపోగా వారిని కూడా కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయిస్తున్నారు. దీంతో నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో రైతుల భూములను ఆన్‌లైన్ చేయటంలో కింది స్థాయి అధికారి నుండి పైస్థాయి అధికారి వరకు నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో వైకాపాకు చెందిన నాయకులకే పనులు జరుగుతున్నాయి, మాకు మాత్రం జరగటం లేదని కొంతమంది తెలుగుతమ్ముళ్లు బాహటంగానే విమర్శలకు దిగుతున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల పందారంలోను పార్టీ స్థాపించిన దగ్గర నుండి జెండామోసిన వారికి కాదని ఆయారాం గయారాంలకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతుండంతో ఆ వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగుసంవత్సరాలు పూర్తిఅయినప్పటికి ఇంతవరకు మేజర్ ప్రాజెక్టులు కాని, కొత్తకొత్త ప్రాజెక్టులు కాని వచ్చిన దాఖలాలు లేవు. నిర్మాణంలో ఉన్నవాటికే నిధులను అరకొరగా విడుదల చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు అసంతృప్తుల్లో ఉన్నారని స్వయానా జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి ప్రకటించారు. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే మాగుంటే ఎవరు సంతృప్తిగా ఉన్నారో అని మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన కొంతమంది శాసనసభ్యులు తమ పంథాను మార్చుకోకమాత్రం రానున్న ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్న వాదన ఆ పార్టీనేతల నుండి వినిపిస్తోంది. మరికొంతమంది శాసనసభ్యులు అయితే కార్యకర్తలు, నాయకులు వచ్చిన సమయంలో వారిని చూసీచూడనట్లుగా నటన చేస్తూ ముందుకువెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా అలాంటి వాటికి చెక్‌పెట్టి కార్యకర్తలు,నాయకులను అక్కున చేర్చుకుని వారిని మేం ఉన్నామంటూ భరోసా కల్పించకపోతే మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాలోని తెలుగుతమ్ముళ్లల్లో ఉన్న అసంతృప్తులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.