ప్రకాశం

మాదాల రంగారావు మృతితో మైనంపాడు గ్రామంలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 27: సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన ప్రముఖ సినీనటుడు, రెడ్‌స్టార్ మాదాల రంగారావు (70) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోమృతి చెందారు. మాదాల రంగారావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ నేపద్యంలో ఆదివారం తెల్లవారుజామున మాదాల రంగారావు కన్నుమూసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుండి ఒంగోలు పాత్రికేయులకు విషయాన్ని తెలిపారు. రంగారావు మృతి చెందిన విషయం తెలియటంతో రంగారావు స్వంత గ్రామమైన జిల్లాలోని మైనంపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా మాదాల రంగారావుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లుతోపాటు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఐ ఒంగోలు నగర కార్యదర్శి ఎస్‌డి సర్దార్, సీపీఐ జిల్లా నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, వి హనుమారెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య, ఆర్ వెంకట్రావు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆర్ చౌదరి తదితరులు రంగారావు తోపాటు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మాదాల రంగారావు మృతికి వారు విప్లవ జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1948 మే 25న మాదాల రంగారావు మైనంపాడు గ్రామంలో జన్మించి, నవతరం పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మించి ఆయన ఎక్కువుగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీసినట్లు ఆయన తెలిపారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించినట్లు ఆయన తెలిపారు. మరోకురుక్షేత్రం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్తానం, తొలిపొద్దు, ఎర్రమల్లెలు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, విప్లవశంఖం, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాలలో రంగారావు నటించినట్లు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాంటి మాదాల రంగారావు ఇక మన మధ్య లేక పోవడం బాధాకరమని, రంగారావు కి విప్లవ జోహర్లు అర్పిస్తున్నట్లు వారు తెలిపారు.