క్రైమ్/లీగల్

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పామూరు యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, జూన్ 12: పామూరుకు చెందిన యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగింది. పామూరుకు చెందిన వెంకటరావు, రమాదేవిల ఏకైక కుమారుడు దీపక్ (26) అమెరికాలో ఎంఎస్సీ పూర్తి చేసి గత కొన్ని రోజులుగా టెక్టాస్ నగరంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లు బంధువులు తెలిపారు. మంగళవారం రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందింది. గత రెండేళ్ల క్రితం న్యూజెర్సీ నగరంలో ఎంఎస్సీ చదువుతుండగా స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. దీపక్ మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువర్గంలో రోధిస్తున్న తీరు పలువురిని కంటితడి పెట్టించింది. దీపక్ మరణవార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కదిరి బాబురావు, కనిగిరి ఎఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, ఎంపీపీ ఆవుల నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ పి రాంబాబు, పామూరు సర్పంచ్ డివి మనోహర్‌లు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. దీపక్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కదిరి బాబురావు అమెరికాలోని భారత రాయబారి కార్యాలయంలో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు రాష్టమ్రంత్రి శిద్దా రాఘవరావు కూడా అమెరికాలోని రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కనిగిరి, జూన్ 12: అప్పులు బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నగర పంచాయతీ పరిధిలోని చాకిరాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చాకిరాలకు చెందిన నరాల శ్రీనువాసుల రెడ్డి (54) కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు. ఎస్‌ఐ యు శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాయతో కొట్టడంతో చిన్నారి మృతి
గుడ్లూరు, జూన్ 12 : మండలంలోని పరకొండపాడు గ్రామంలో మూడు సంవత్సరాలు గల చిన్నారిని అదే గ్రామానికి చెందిన మానసికస్థితి సరిగాలేని మైనర్ బాలిక రాయితో కొట్టి చంపిన సంఘటన మంగళవారం జరిగింది. గుడ్లూరు ఎస్‌ఐ సంపత్‌కుమార్, కందుకూరు సీఐ నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పరకొండపాడు గ్రామానికి చెందిన ప్రౌజ్ (3) అదే గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ రాయితో కొట్టి చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రౌజ్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటూ చిన్నారని వారి అమ్మమ్మ దగ్గర ఉంచారు. మంగళవారం అకస్మాత్తుగా చిన్నారి మృతి చెందినట్లు సమాచారం తెలపడంతో వారు హైదరాబాద్ నుంచి హుటాహుటిన పరకొండపాడుకు వచ్చారు. చిన్నారి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోధన పలువురిని కలిచివేసింది.

తప్పిపోయిన బాలుడు ఆచూకీ లభ్యం
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఉలవపాడు, జూన్ 12: తప్పిపోయిన నాలుగు సంవత్సరాల బాలుడిని 24 గంటల్లో పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఉలవపాడులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అశోక్‌కార్తీక్, తండ్రి రాజశేఖర్, తల్లి ప్రమీనలతో కలిసి సోమవారం ఉలవపాడులోని తాత ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తాత మామిడితోటలో ఉండటంతో ముగ్గురు కలిసి తోట వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడిన తరువాత బాలుడు, తల్లి ప్రమీన ఉలవపాడుకు వచ్చారు. తోటలో అశోక్‌కార్తీక్, తండ్రి రాజశేఖర్‌లు అక్కడే ఉండిపోయారు. బాలునిడి తోటలో కూర్చొని బెట్టి తండ్రి మామిడి తోటను చూస్తుండగా కొద్దిసేపటి తరువాత బాలుడు చూడగా కనిపించలేదు. రెండు, మూడు గంటలు బాలుడిని తోటలో వెతికాడు. కనిపించకపోవడంతో సోమవారం రాత్రి ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడు అదృశ్యం అయిన కేసులో స్థానిక ఎస్‌ఐ రవణయ్య డిఎస్పీ దృష్టికి తీసుకుని పోగా ఆయన ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్పీ నాలుగు టీమ్‌లను, డాగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సోమవారం 4 గంటల నుంచి మంగళవారం 9 గంటల వరకు పోలీసులు గాలించగా మంగళవారం 12 గంటల సమయంలో సమీపంలోని మామిడి తోటలో పడుకొని ఉన్నాడు. వెంటనే బాలుడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి డిఎస్పీ ప్రకాష్‌రావు ఆధ్వర్యంలో తల్లిండ్రులకు అప్పగించారు. గాలింపు చర్యల్లో సీఐ నరసింహారావు, ఉలవపాడు ఎస్‌ఐ రవణయ్య, గుడ్లూరు ఎస్‌ఐ సంపత్‌కుమార్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. బాలుడిని క్షేమంగా ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు అభినందనలు తెలిపారు.