ప్రకాశం

ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 19: సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకొని ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికతో కృషిచేస్తున్నట్లు ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. 15 రోజులపాటు సింగపూర్ దేశం పర్యటనను ముగించుకొని ఒంగోలుకు వచ్చిన సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్ వెంకటకృష్ణ తన పర్యటన ముఖ్య ఉద్దేశాల గురించి మాట్లాడుతూ మలేషియా నుంచి సంగపూర్ విడిపోయిన తరువాత మరింత అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అతి తక్కువ జనాభా కలిగిన సింగపూర్ దేశం మూడు సిద్ధాంతాల మీద అభివృద్ధి చెందినట్లు కమిషనర్ తెలిపారు. ఒకటి క్రమశిక్షణ, రెండు అభివృద్ధి, మూడు డెమోక్రసీ అన్నారు. సింగపూర్ దేశంలోప్రతి ఒక్కరూ ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారని , సగటు మానవుడు ప్రతి ప్రభుత్వ నిబంధనను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఎవరి పనిని వారు క్రమశిక్షణతో చేయబట్టే సింగపూర్ అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందినట్లు కమిషనర్ తెలిపారు. అక్కడి ప్రజలు ఎక్కువ శాతం సేవారంగం పై ఆధారపడి ఉంటారని తెలిపారు. పబ్లిక్ వాటా కింద కొంత నగదు, ప్రభుత్వం కొంత నగదును ఏర్పచుకుంటుందన్నారు. దేశంలోని 80శాతం మంది ప్రజలకు ప్రతి ఒక్కరికి సాంత ఇల్లు నిర్మాణం కలిగి ఉంటారని తెలిపారు. ప్రభుత్వం భూమి మంజూరు చేసి 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తుందని తెలిపారు. తదనంతరం తన కుటుంబ సభ్యులు లీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క పనిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ దేశం ప్రగతి పధాన నడుస్తుందని కమిషనర్ తెలిపారు. అయితే మలేషియా మాత్రం ఇప్పటికి అభివృద్ధి చెందలేదని , సింగపూర్‌ను చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మున్సిపల్ కమిషనర్లను 15 రోజులపాటు సింగపూరు పర్యటనకు పంపిందని, ఈ పర్యటనలో తాము ఎన్నో కొత్త అంశాలను అధ్యాయనం చేయగలిగామని కమిషనర్ తెలిపారు. సింగపూర్ తరహాలో ఏపీని కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహార్నిషలు శ్రమిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త సంస్కరణలు రూపుదిద్దుకుంటూ నగర అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఒంగోలు నగర పాలక సంస్థ యంఇ సుందరరామిరెడి తదితరులు పాల్గొన్నారు.