ప్రకాశం

అగ్నిగుండంగా మారిన ప్రకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం, రాజస్థాన్‌నుండి వేడిగాలులు వీస్తుండటంతో ప్రకాశం జిల్లా అగ్నిగుండంగా మారింది. ఉదయం ఎనిమిదిగంటలనుండే జిల్లావ్యాప్తంగా వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్టవ్య్రాప్తంగా మూడురోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకే పరిమితం కావాల్సివచ్చింది. మరో రెండురోజులపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలనుండి సాయంత్రం ఐదుగంటల వరకు వెచ్చటి పడమటి గాలులతోకూడిన మండుటెండలు కాస్తుండటంతో జిల్లాలోని ప్రధానమైన పట్టణాలల్లోని రోడ్లన్ని జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం ఉదయానే్న గొడుగులు సహాయంతో కార్యాలయాలకు వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లావ్యాప్తంగా ఎండల ధాటికి భూగర్భజలాలు సైతం ఎండిపోతున్నాయి. పశ్చిమప్రకాశంలోనే కాకుండా తూర్పుప్రకాశంలోనూ భూగర్భజలాల మట్టం పడిపోతుండటంతో కోస్తాతీరప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతకొన్ని రోజులనుండి 40డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈనెల 15వతేదీన 40.7డిగ్రీలు, 16న 41.9, 17న 40.1, 18న 40.8, 19న 40.1సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో రెండురోజులపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయటంతో అన్నివర్గాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిఇలావుండగా జిల్లా అగ్నిగుండంగా మారడంతో శీతపానీయాలకు గిరాకీ పెరిగింది. కొబ్బరి బొండాలు, పుచ్చకాయల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఏసీలు, ఫ్యాన్ల విక్రయాలతో ఎలక్ట్రానిక్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. కాగా సాయంత్రం వేళ కొంతమంది పర్యాటకులు సముద్రస్నానాలు ఆచరించేందుకు పరుగులు తీస్తున్నారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.