ప్రకాశం

ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు , మే 6: జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ శుక్రవారం స్థానిక జిల్లా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటల నిర్మాణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలను ఏర్పాటుచేసి భూగర్భజలాలు పెరిగే విధంగా చూడాలని చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని 56 పోలీసుస్టేషన్ల పరిధిలో ఇంకుడు గుంటల ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్‌పి ఒంగోలులోని జిల్లా ఎస్‌సి కార్యాలయం ఆవరణలో ఇంకుడు గుంటల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీసు కార్యాలయం వద్ద ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో భుగర్భలాలు పెరిగి అక్కడ ఉన్న బోర్‌వెల్స్‌లో నీరు వస్తాయని తెలిపారు, దీంతో ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లాలోని 56 పోలీసుస్టేషన్ పరిధిలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసి ప్రారంభించుకోనున్నట్లు జిల్లా ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఎస్‌పి బి రామానాయక్, ఎఆర్ అడిషనల్ ఎస్‌పి జె కృష్ణయ్య, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.