ప్రకాశం

చెట్టుకు ఉరేసుకుని తల్లి, కూతురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి,మే 6:మండలంలోని ఇలపావులూరుగ్రామంలో కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్న పులి రాములమ్మ (35), ఆమె కూతురు అనిత (12) మద్దిపాడు మండలం దేనువుకొండ శివారులో శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని మృతిచెందారు. పులి రాములమ్మ భర్త ఏడుకొండలు బేల్త్రారి పనిచేస్తూజీవనం సాగిస్తున్నారు. మృతిచెందిన ఇద్దరు కుటుంబకలహాల కారణంగా మృతిచెంది ఉంటారని గ్రామస్థులు తెలిపారు. ఇలపావులూరు విఆర్‌ఒ రమణ ఫిర్యాదు మేరకు ఒంగోలు డిఎస్‌పి గుంటుపల్లి శ్రీనివాసరావు, సిఐ సంజీవ్‌కుమార్, ఎస్‌ఐ సుబ్బరాజులు గ్రామానికి విచ్చేశారు. మృతికి సంబంధించిన కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. చీమకుర్తి ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.