ప్రకాశం

25న ఒకేసారి జిల్లాలో 200 అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 17: జిల్లాలో 200 అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు ఒకేసారి పెద్దఎత్తున ఈనెల 25న ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి అంగన్‌వాడి భవనాలు, బిటి, సిసి గ్రావెల్ రహదారులు, గ్రామపంచాయితీ భవనాలు, మండల మహిళా సమాఖ్య భవనాలు, గోకులంలు, మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉపాధిహామీ పథకం అనుసంధానంతో చేపట్టిన పనులు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలో మంజూరైన 549 అంగన్‌వాడి భవనాలకు గాను, రెండువందలభవనాల నిర్మాణ పనులు ఈనెల 25న మొదటిదశలో పెద్దఎత్తున మొదలుపెట్టి వచ్చే మూడునెలల కాలంలో తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. ప్రతిభవనానికి ఒక పర్యవేక్షణాధికారిని నియమించాలని, ప్రతి పది భవనాలకు ఒక సిడిపిఒ స్థాయి అధికారిని నియమించాలని అంగన్‌వాడి భవనాల నిర్మాణాలు పూర్తిచేసేందుకు వారే బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో ఈనెలలో 185 కిలోమీటర్ల సిసి రహదారులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 45కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయని, మిగిలిన లక్ష్యం సాధించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. అంతేగాక ఎఫ్‌టిఒలను త్వరితగతిన జనరేట్ చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు ఒకటవతేదీన మంజూరైన మండల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు ఒకేసారి మొదలు పెట్టాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 80చోట్ల విలేజ్ హాట్లు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, ఇందులో 56 మండలాల్లో మండలానికి ఒక గ్రామపంచాయతీలోను, మరో 24 మత్స్యకారులకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నెలకొల్పేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం పంచాయితీల తీర్మానాలు వెంటనే తెప్పించే ఏర్పాట్లు చేయాలన్నారు.
జిల్లాలో 92 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు చేశామని, అందులో 71 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. నియోజకవర్గానికి రెండుకోట్లరూపాయల చొప్పున డబ్లుబిఎం గ్రేడ్-2 రహదారులు మంజూరయ్యాయని, సంబంధిత శాసనసభ్యులను సంప్రదించి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణంతోపాటు మంజూరైన పదివేల మరుగుదొడ్లల్లో రెండువేలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని వచ్చేనెల ఒకటవతేదీన ఒకేసారి పెద్దఎత్తున నిర్మాణ పనులు మొదలు పెట్టేలా సంసిద్ధం కావాలన్నారు. జిల్లాలో 24 గోకులంల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని జోరుగా సాగాలని, ఇందుకోసం పదివేల గుంతలను తవ్వే పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. జిల్లాలో 550 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకానికి మంజూరు ఉత్తర్వులు చేశామని, 234 మల్బరీ రేరింగ్ షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, విలేజ్ హాట్‌లు , అంగన్‌వాడీ భవనాలు, గోదాములు, గ్రామ పంచాయితీ భవనాలు తదితర వౌళిక సదుపాయాల కల్పన కోసం 16 కోట్ల రూపాయలు కేటాయించామని , వాటికి సంబంధించిన పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని , ఇప్పటి వరకు 1028 గ్రామ పంచాయితీలకు గానూ 944 గ్రామ పంచాయితీల్లో మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన 84 పంచాయితీలకు ప్రతిపాదనలు వెంటనే పంపి ఆ కేంద్రాలు మంజూరు చేయించుకోవాలన్నారు. ఇందులో ఇప్పటికే 188 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే అక్టోబర్ 2వ తేదీలోగా అన్నిచోట్ల కేంద్రాలు ఏర్పాటు కావాలని, ఈ నెలలో మిగిలిన లక్ష్యం 154 కేంద్రాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.