ప్రకాశం

దేశవ్యాప్త సమ్మెతో ఒంగోలులో నిలిచిపోయిన లారీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 20: దేశ వ్యాప్తంగా లారీల సమ్మెతో శుక్రవారం ఒంగోలులో లారీలు నిలిచిపోయాయి. డీజిల్‌ను జిఎస్టీలోకి చేర్చాలని, కాలం చెల్లిన టోల్‌ప్లాజాలను ఎత్తివేయాలని, వాహన ప్రీమియం చార్జీలను తగ్గించాలని, రవాణా శాఖ వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ లారీల యజమానులు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు ఒంగోలులోని లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద లారీలను స్వచ్ఛందంగా నిలిపివేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఒంగోలు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తదితరులు హెచ్చరించారు. ఒంగోలులో లారీలు నిలిచిపోవడంతో కూరగాయలు, ఇతర వస్తువులు రవాణా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా పోలీసులు లారీ యజమానులు, లారీ అసోసియేషన్ వారి వద్దకు వెళ్లి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.