ప్రకాశం

నేతలకు శిరోభారమైన ఎఎంసిల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మే 8: మార్కెట్ కమిటీల నియామకాలు ఎమ్మెల్యేలకు, ఇన్‌ఛార్జిలకు తలనొప్పిగా మారాయి. పదవుల కోసం సామాజికవర్గాలుగా పోటీ పడటంతో ఏ సామాజికవర్గానికి పదవులు ఇస్తే మిగిలిన సామాజికవర్గాలు అలకపూనుతాయోనన్న భయం నేతలను వెంటాడుతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు ఎఎంసి పదవి కోసం ఓవైపు యాదవులు, మరోవైపు కాపులు పోటీ పడుతుండగా వీరిద్దరిమధ్యన వైశ్య సామాజికవర్గం కూడా పదవి ఆశిస్తుండటంతో ఎవరికి పదవి ఇచ్చినా మిగిలినవారు పార్టీకి దూరం అవుతారేమోనన్న భయం ఇన్‌ఛార్జి అన్నా రాంబాబును వెంటాడుతోంది. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి ఎఎంసి పదవి కోసం ఒకవైపు కాపువర్గం, మరోవైపు వైశ్య సామాజికవర్గం పోటీ పడుతుండగా ఇన్‌ఛార్జి కాపువర్గానికి కొమ్ముకాయగా వైశ్యసామాజికవర్గం అధిష్ఠానంతో ఇక్కడి పరిస్థితులను వివరించి పదవి పొందేందుకు ప్రయత్నించగా సఫలమైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక యర్రగొండపాలెం ఎఎంసి చైర్మన్ నియామకం త్రిసభ్యకమిటీ ఉన్నసమయంలో వైశ్య, కమ్మ, యాదవ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన వారు పోటీ పడగా పట్టణానికి చెందిన వైశ్యసామాజికవర్గానికి చెందిన గోళ్ళ సుబ్బారావు త్రిసభ్యకమిటీసభ్యుల లేఖతో ఫైల్ నడిపి వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు తీసుకువెళ్ళారు. అనంతరం మిగిలిన ఆశావహులంతా విషయం తెలుసుకొని త్రిసభ్యకమిటీసభ్యుడు డాక్టర్ మనె్న రవీంద్రపై ఒత్తిడితెచ్చి వ్యవసాయశాఖ మంత్రివద్దకు వెళ్ళి తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. అయితే వైఎస్‌ఆర్‌సిపిలో గెలిచి ఇటీవల టిడిపిలో చేరిన ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఈ నియామకంపై ఏమి చర్యలు తీసుకుంటారో, ఎవరికి పదవిని కట్టపెడతారో అర్థంకాక ఆశావహులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే రాష్టమ్రంత్రి శిద్దా రాఘవరావు నియోజకవర్గమైన దర్శిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ కాపు, కమ్మ, రెడ్డి, వైశ్య సామాజికవర్గాలు ఎఎంసి చైర్మన్ పదవి కోసం పట్టుపడుతుండటంతో ఏ సామాజికవర్గానికి ఇచ్చినా మిగిలిన సామాజికవర్గాలు పార్టీకి దూరమై అలకపూనితే ఏమిచేయాలన్నదే అర్థంకాక నియామకంపై దృష్టి సారించడం లేదని నియోజకవర్గంలోని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా పదేళ్ళతరువాత అధికారం చేపట్టిన టిడిపి నుంచి నామినేటెడ్ పదవులు ఆశించడం న్యాయమైనప్పటికీ పోటీపెరగడంతో ఎవరికి ఇవ్వాలో అర్థంకాక ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లాపార్టీ జోక్యం చేసుకొని ఎఎంసి కమిటీల నియామకంపై చర్యలు చేపట్టాలని తెలుగుతమ్ముళ్ళు కోరుతున్నారు.