ప్రకాశం

మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 12 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత అంటూ మాటలు చెప్పడం తప్ప మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలుపరిచిన పాపాన పోలేదని సినీనటి, నగర శాసనసభ్యురాలు ఆర్‌కె రోజా ఘాటుగా విమర్శించారు. వైకాపా మహిళా విభాగం ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీనటి, నగర శాసన సభ్యురాలు రోజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు పూర్తిగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని, అదే విధంగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్ననం భోజనం పథకం కార్మికులు వేతనాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని , అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని రోజా విమర్శించారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేయకపోవడం డ్వాక్రా మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె తెలిపారు. అదే విదంగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ లు, మధ్యాహ్న భోజనం పధకం కార్మికులకు వేతనాలు పెంచకపోవడంతో వారు చాలీచాలని వేతనాలతో వారి కుటుంబ పోషణ జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల విజయవాడలో మధ్యాహ్నం పధకం కార్మికులు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తే వారిపై పోలీసుల చేత దాడిచేయించి, వారిని అక్రమంగా అరెస్ట్ చేయించడం దారుణ మన్నారు. మహిళల పట్ల చంద్రబాబు అవలంబిస్తున్న వ్యితిరేక విధానాల పై మహిళలు ఆందోళనలు చేస్తూ పంతం పట్టారని, మహిళల పంతంతో చంద్రబాబు హతం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల పై దాడులు పెరిగాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల క్రైం రేట్ ప్రస్తుతం 11శాతం పెరిగిందన్నారు. అప్పటిలో రెవెన్యూ శాఖాధికారి వనజాక్షి ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే దాడి చేశారని, ప్రస్తుతం శిల్ప అనే వైద్యురాలు మరణం వెనుక టీడీపీ పాత్ర ఉందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుండా అందుకు కారకులైన వారికి అండగా ఉండి నేరాలను ప్రోత్సహించేవిదంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. మరో 8 నెలలలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో ప్రజలు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి పట్టం కట్టనున్నారని, జగన్ అధికారంలోకి వస్తే మహిళల సమస్యలు అన్ని పరిష్కారిస్తారని ఆమె తెలిపారు. ఇప్పటికే జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది చూసిన చంద్రబాబు, లోకేష్ ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. చంద్రబాబు ఎన్‌డిఏ నుంచి బయటికి వచ్చినప్పటికి లోపాయికారిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, అదేవిధంగా మరొకపక్క చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీని ఇటీవల ఒక కార్యక్రమంలో కౌగిలించుకుని అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నారని, చంద్రబాబు అవసరమైతే గాడిద కాళ్లు అయినా పట్టుకుంటారని ఆమె ఎద్దేవా చేశారు. వైకాపా మహిళలు వచ్చే ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి తీసుకొస్తే జగన్‌లో రాజన్న పాలనను చూడవచ్చిని అందుకు మహిళలు కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి , ప్రకాశం జిల్లాల కన్వీనర్ శ్రీ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, వైకాపా మహిళా విభాగం నాయకురాళ్లు బైరెడ్డి అరుణ, పి అరుణ, ఎస్ రమణమ్మ, పురుణి ప్రభావతి, పోకల అనూరాధ, బడుగు ఇందిర, కావూరి సుశీల, రమాదేవి, మాధవి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.