ప్రకాశం

తెలుగుభాషా, సాంస్కృతిక పరిరక్షణకు ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 12:తెలుగుభాషా, సాంస్కృతిక పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మాక, సంస్కృతి సమితి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగుభాషా బ్రహ్మోత్సవాలు-2018 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శిద్దా మాట్లాడుతూ తెలుగుపదసంపదను సంరక్షించుకోవాల్సి ఉందన్నారు. భాషాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. తెలుగుభాషను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. కళలను ప్రోత్సహించాలన్న అభిలాష గత గోదావరి, కృష్ణాపుష్కరాల్లో ఐదువేలమంది విద్యార్థినులతో కూచిపూడి నృత్యాన్ని ఏర్పాటుచేశారని ఈ సందర్బంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాల్లో ముందుగా కూచిపూడి భరతనాట్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కవితాగోష్ఠులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంతోమంది కవులు ఉన్నారని, వారి కవితలు, వ్యాసాలు, గ్రంథాల ముద్రణకు ఆర్థిక ఇబ్బందులు వలన ప్రచురణకు నోచుకులేకపోతున్నట్లు తెలిపారు. జిల్లాలో తెలుగుభాషకోసం విశేషంగా కృషిచేస్తున్న వారందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. దేశభాషలందు తెలుగులెస్స అని మరవకూడదన్నారు. తెలుగుభాషాభివృద్ధికి సెమినార్లు ఏర్పాటుచేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగుభాష, సంస్కృతిపై చర్చించుకునేందుకు,వాటిని కాపాడుకునేందుకు ఇది ఒక్కటి వేదికన్నారు. అందరు ఐక్యంగా ఉండి తెలుగుభాషను, సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలు జరుపుకోవటం అభినందనీయమన్నారు. జిల్లాలో కళాకారులు ఉన్నప్పటికీ కళాపోషకులు తగ్గారని, తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన తెలుగుభాషలో మాట్లాడలేకపోతున్నామన్నారు. భాషలో మెలకువలు తెలుసుకోవాలనే తపన తమలో ఉందని, తాము నిత్యం విద్యార్థులమేనని అన్నారు. తల్లిదండ్రులు తమపిల్లలకు ఇప్పటినుండే తెలుగుభాషపై మమకారం పెరిగేలా ప్రొత్సాహం అందించాలని, భవిష్యత్తులో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సృజానాత్మాకత, సంస్కృతి సమితి ముఖ్యకార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి విజయభాస్కర్ మాట్లాడుతూ మాతృభాషాభివృద్దికి రాష్ట్రప్రభుత్వం ఉద్యమంలా కృషిచేస్తుందన్నారు. 2018లో తెలుగుభాషా వికాస సంవత్సరంగా రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారని వివరించారు. తెలుగుభాష సంస్కృతుల అభివృద్దికి కమిటి వేయటం జరిగిందని, అందులోభాగంగా నాటక అకాడమిని పునరుద్దరించటం జరిగిందన్నారు. త్వరలో మిగిలిన అకాడమిని కూడా పునరుద్దరణ కానున్నాయని తెలిపారు. తెలుగుభాషాభివృద్ది ప్రాధికార సంస్ధ ఏర్పాటుకానుందన్నారు. తెలుగుభాష త్వరలో అంతరించేపోయే, మరుగున పడిపోయే అవకాశాలున్నాయని అంతర్జాతీయ సర్వేలో పేర్కొన్నారని మనదైన అచ్చ తెలుగుభాషను, పదసంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నేటి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక పదాలకు అవసరమైన వాటికి తెలుగుపదాలు అనే్వషించాలని, పదాల సృష్టి జరగాల్సి ఉందన్నారు. జనజీవనంలో జానపదంలో ప్రజలు మాట్లాడే పామర భాష తెలుగుభాష అని వివరించారు. భాషలో విలసిల్లిన కళలలు అంతరించిపోతున్నాయని, తెలుగుభాష సుసంపన్నమైందని, తెలుగుభాషకు చికిత్స అందించి బతికించుకోవాలన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రతిచోట తెలుగును వాడాలన్నారు. సచివాలయం నుండి గ్రామపంచాయితీ వరకు కార్యాలయాల్లో రాసే ప్రతి దస్త్రం తెలుగులోనే రాసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో తెలుగుభాష ప్రముఖులు డాక్టర్ జివి పూర్ణచంద్, గుమ్మా సాంబశివరావు, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా అక్షరయాత్ర ర్యాలీ జిల్లాగ్రంధాలయంనుండి ప్రారంభమై ఎర్రన విగ్రహం వరకు కొనసాగింది. తెలుగుభాషా బ్రహ్మోత్సవాలు 2018ని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఎంఎల్‌సి కరణం బలరాం, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనచేశారు. చందు డ్యాన్స్ అకాడమి చిన్నారుల నృత్యాలు ఆహుతులను అలరించారు. చిన్నారులకు జ్ఞాపిక, ప్రశాంసపత్రాలను మంత్రి శిద్దా అందచేశారు. తేళ్ల అరుణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు ఆకొండి విశ్వనాధం, కొలకలూరి స్వరూపరాణి, చదలవాడ లక్ష్మినరసింహరావు, పాటిబండ్ల ఆనందరావు, వేదగిరి వెంకటనరసింహరాయశర్మ, శ్రీరామకవచం సాగర్, డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు, నారాయణం బాలసుబ్రమణ్యం, ధేనువకొండ వెంకటసుబ్బారావు, షేక్ షంషేర్ అహ్మాద్, యు దేవపాలన, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, ఎంవిఎస్ శాస్ర్తి, ఉన్నం జ్యోతివాసు, పొన్నూరు వెంకటశ్రీనివాసులు, కుర్రా ప్రసాదుబాబులను మంత్రి శిద్దా రాఘవరావు, కరణం బలరాంలు శాలువ, జ్ఞాపిక, ప్రశాంసపత్రంలో సత్కరించారు. సిహెచ్ కోటేశ్వరరావు చిత్రించిన ఎర్రన చిత్రపటాన్ని మంత్రి శిద్దా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సాహితిప్రియులు, భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.