ప్రకాశం

చంద్రబాబు పాలనలో ముస్లింలకు స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఆగస్టు 17: ముస్లిం సంక్షేమం, అభివృద్ధి, ముస్లింల సామాజిక అవసరాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ముస్లింలకు స్వర్ణయుగమని రాష్టమ్రైనార్టీ ఫైనాన్స్‌కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ హిదాయిత్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న గుంటూరులోని బ్రహ్మానందారెడ్డి స్టేడియంలో తలపెట్టిన నారా హమారా - టిడిపి హమారా భారీ బహిరంగ సభకు లక్షమందికి పైగా హాజరయ్యే ఈకార్యక్రమాన్ని ముస్లింలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముస్లిం సంక్షేమానికి బీజం పడిందని అందులో భాగంగానే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా దుల్హాన్ పథకం, ఇమామ్ వౌజన్లకు గౌరవవేతనం, కడప, విజయవాడలో హజ్‌హౌస్ నిర్మాణం, కర్నూలులో ఉర్దూయూనివర్శిటీ నిర్మాణం, ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకోసం 15లక్షల రూపాయలు కేటాయించటం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముస్లింల సంక్షేమంకోసం, ముస్లిం హక్కులకోసం రాజీలేనిపోరాటం చేసి నియంత్రృత్వ, ఫాసిస్టు భావజాలంగల నరేంద్రమోదీపై గొంతెత్తి ఎదిరించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఒక్క చంద్రబాబునాయుడేనన్న సంగతిని ముస్లింలకు గుర్తుచేశారు. కర్నాటక ఎన్నికల్లో చంద్రబాబు పిలుపుమేరకు బీజేపీ పతనం ప్రారంభమైందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రధానిగా నిర్ణయాత్మాక పాత్రలో తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించటం ఖాయమని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముస్లింల సంక్షేమం కోసం 2018-19 సంవత్సరానికి 1106కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి ముస్లీం పక్షపాతిగా ముఖ్యమంత్రి కీర్తించబడుతున్నారని తెలిపారు. గుంటూరు బ్రహ్మానందారెడ్డి స్టేడియంలో జరిగే నారాహమారా- టిడిపి హమారా సభ ముస్లిం ఆత్మగౌరవ సభగా భావించి ప్రతి ముస్లిం సభకు హాజరై తెలుగుదేశంపార్టీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్టమ్రైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కపిల్‌బాషా, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు షేక్ కరీముల్లా, నాయకులు పఠాన్ హానీఫ్‌ఖాన్, మహమ్మద్‌బాషా, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గుంటూరులో జరగనున్న నారాహమారా - టిడిపి హమారా కార్యక్రమ కరపత్రాలను శుక్రవారం ఒంగోలు నగరంలోని గంటాపాలెం నూర్‌మసీదు వద్ద రాష్టమ్రైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ హిదాయిత్ ఆవిష్కరించి పంపిణీ చేశారు. అదేవిధంగా గంటాపాలెంలోని మజ్‌జిద్ వద్ద కరపత్రాలను పంపిణీ చేసి ముస్లింలను సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.