ప్రకాశం

నాలుగేళ్లలో 3.12 కిలోమీటర్ల టనె్నల్ తవ్వకం టీడీపీ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన టనె్నల్‌ను గడచిన నాలుగేళ్ళలో 3.12 కిలోమీటర్లు తవ్విన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం బివి రాఘవులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు టనె్నల్స్ తవ్వేందుకు జర్మనీ, అమెరికాల నుంచి టిబిఎం యంత్రాలను తీసుకువచ్చారు. ఆ యంత్రాలు రోజుకు 15 మీటర్లు తవ్వగల సామర్థం కలిగి ఉండగా, నత్తకు నడకనేర్పినట్లు గడచిన నాలుగేళ్ళకాలంలో మూడున్నర కిలోమీటర్లు మాత్రమే టనె్నల్ తవ్వకాలు జరిగాయని, ఈ రీతిన సంక్రాంతికి నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత విధానాలకు స్వస్తి పలకకుంటే రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి టనె్నల్ నిర్మాణ పనులను వేగవంతం చేసినప్పుడు ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఈసందర్భంగా కార్మికులతో చర్చించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో రాష్టస్రభ్యులు ఎం వెంకటేశ్వర్లు, వై వెంకటేశ్వరరావు, జాలయ్య, కందుల కాశిరెడ్డి, సయ్యద్ హనీఫ్‌తోపాటు సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.