గుంటూరు

బీసీల జీవితాల్లో వెలుగులు నింపేది వైసీపీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: బీసీల సమస్యలు పరిష్కారం కావాలన్నా, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఇన్నర్ రింగు రోడ్డులోని ఓ కళ్యాణ మండపంలో వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే క్షేత్రస్థాయిలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారన్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీకి ప్రజలు అధికారం ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్లకు సీట్లు కేటాయిస్తుందని, అందుకు భిన్నంగా సామాన్యులు సైతం చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే తమ పార్టీ అభిమతమన్నారు. మాజీ ఎంపీ చిమటా సాంబు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కిలారి రోశయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ బీసీలపైనే ఆధారపడుతున్నాయని, సమస్యల సాధన కోసం పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ తనను సమన్వయకర్తగా జగన్ నియమించారంటే బీసీలపై ఆయనకు గల చిత్తశుద్ధి అర్ధం చేసుకోవచ్చన్నారు. వైసీపీ రాష్ట్ర నాయకుడు గోళ్ల శివశంకర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీల్లో 15 శాతం యాదవ సంఘీయులు ఉన్నారన్నారు. అధ్యక్షత వహించిన జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేశారన్నారు. ఆరోగ్య శ్రీ వలన వేల కుటుంబాలు లబ్ధిపొందాయని, అయితే నేడు పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందన్నారు. బీసీల సమస్యలన్నింటినీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తుందని తెలిపారు. తొలుత గోళ్ల శివ శంకర్ యాదవ్ యూత్ ఆధ్వర్యాన నగరంలో భారీ మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్‌కుమార్ యాదవ్, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకట రమణ, జెడ్పీ మాజీ చైర్మన్ కె నాగేశ్వరరావు, వై తులసీరామ్, ఎల్ వెంగళరావు, విడదల రజనీ, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.