ప్రకాశం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై నేటి నుండి గుంటూరులో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,అక్టోబర్ 21: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ఈనెల 22వతేదీనుండి నాలుగురోజులపాటు రాష్టవ్య్రాప్తంగా గుంటూరులోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి సాయికృష్ణ వెల్లడించారు. ఆదివారం స్థానిక బీజేపీ జిల్లాకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై గుంటూరులోని ధర్నా చౌక్ వద్ద చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నాలుగురోజులపాటు రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాకలెక్టరేట్ల వద్ద బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాల్సిన రాష్ట్రప్రభుత్వం కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిష్కారం చూపించాల్సిన రాష్ట్రప్రభుత్వం బాధితులను పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికే ఎంతోమంది ఏజెంట్లు, బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం నిరోధించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేలకోట్లరూపాయలు అగ్రిగోల్డ్ యజమాన్యం దోచుకున్న పట్టించుకోవటం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న ఐటీదాడులకు కేంద్రప్రభుత్వానికి ఏలాంటి సంబంధం లేదన్నారు. బినామీకంపెనీలపైనే ఐటీదాడులు జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బినామీ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశంపార్టీ నాయకులు కేంద్రప్రభుత్వంపై విమర్శిలుచేయటం అర్ధరహితమన్నారు. మరో ఎంపి ముందుకు వచ్చి తోటి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావుపై తీవ్రమైన ఆరోపణలు చేయటం అర్ధరహితమన్నారు. అక్రమంగా సంపాదించిన ప్రతి ఒక్కరికి ఏప్పుడైనా తిప్పలు తప్పవన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తిరిగి గెలిచేందుకు సానుభూతికోసమే బిజెపిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో వెనకబడి ఉందన్నారు. కరువుతోఅల్లాడిపోతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. ప్రకాశం జిల్లాకు రామాయపట్నం పోర్టురావాలని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలని, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటుచేయాలని, కనిగిరిలో నిమ్జ్‌ను వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు ఇంతవరకు శంఖుస్ధాపన చేయలేదని విమర్శించారు. ఈసందర్బంగా జిల్లాపార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సోమవారంనుండి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్‌బాధితులందరు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. ఈవిలేఖర్ల సమావేశంలో బిజెపి నాయకులు షేక్ ఖలీఫాతుల్లా భాషా,కొమ్మి నరసింగరావు, గోలి నాగేశ్వరరావు, కొమ్ము శ్రీనివాసరావు, రేగుల రామాంజనేయులు,రావులపల్లి నాగేంద్రయాదవ్, పవన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.