ప్రకాశం

12న జ్ఞానభేరిని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 6 : ఒంగోలులో ఈ నెల 12వ తేదీన విద్యార్థుల భాగస్వామ్యంతో జరగనున్న జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి తన ఛాంబర్‌లో వైస్ ఛాన్సలర్ రాజేంద్రప్రసాద్, వివిధ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో జ్ఞానభేరి కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానభేరి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా మంచి దృక్పధం, విజ్ఞానవంతమైన కొత్త ఆలోచనలతో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. విద్యార్థులచే మంచి ప్రాజెక్టు, వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా చూడాలన్నారు. ఆయా స్టాల్స్‌లో ఉన్న విద్యార్థులు ప్రాజెక్టులపై మంచి అవగాహన కలిగి ఉండి వివరించేలా చూడాలన్నారు. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విద్యార్థులచే వకృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, విజేతలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో తాము ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ వివరాలు, ముఖ్యమంత్రితో ముఖాముఖిలో మాట్లాడే విద్యార్థుల పేర్లు ఈ నెల 8వ తేదీ లోపు జిల్లా రెవెన్యూ అధికారికి అందజేయాలని కలెక్టర్ ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, వాటికి సంబందించిన వారి పేర్లు కూడా అందజేయాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. ప్రభుత్వం జ్ఞానభేరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందులో 15 వేల మంది విద్యార్థులు, వైస్ ఛాన్సలర్స్, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఒంగోలు ఆర్డీవో పెంచలకిశోర్, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ప్రసాద్, వైస్ చైర్మన్ పి నరసింహారావు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు.