ప్రకాశం

మహిళలను ముందుపెట్టి రాజకీయాలు చేయటం వైసీపీకే చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జనవరి 21: మహిళలను ముందుపెట్టి రాజకీయాలు చేయటం వైసీపీకే చెల్లిందని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం స్థానిక తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైకాపా మహిళానేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరీ వైఎస్ షర్మీలపై సోషల్‌మీడియాలో అక్రమంగా ఎవరో పోస్టింగ్ పెడితే ఆ పోస్టులకు తెలుగుదేశంపార్టీతోపాటు ముఖ్యమంత్రి పేరును కూడా ఆమె వాడటం సరైంది కాదన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిందన్నారు. సోషల్‌మీడియాలో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు చెప్పారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశంపార్టీని బజారుకీడ్చేవిధంగా షర్మీల ప్రయత్నాలుచేసిందని ఆరోపించారు. చివరకు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేక తెలంగాణ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదుచేయటం బాధాకరమన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కోడికత్తికేసులో హైదరాబాదులోనే కేసు నమోదుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రధాని మోదీ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంలో కేంద్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. మహిళల సంక్షేమంకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆ పథకాలను మహిళల్లోకి విస్తత్రంగా తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత వేలాది సంఖ్యలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి ప్రపంచంలోనే మహిళలకు గుర్తింపు తెచ్చారన్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అంగన్‌వాడీ సెంటర్లను ఏర్పాటుచేసి మహిళలను ఆర్థికపరంగా బలోపేతం చేసినట్లు చెప్పారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకానికి మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య తాను వారధిగా పనిచేస్తానని పేర్కొన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీశ్రేణులు సిద్ధం కావాలన్నారు.
రెండువేల రూపాయల పెన్షన్‌ను పెంచటం శుభపరిణామన్నారు. డ్వాక్రామహిళలకు అదనంగా మరో పదివేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర, జిల్లామహిళా నాయకులు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, ఎల్‌టి భవాని, గంగవరపు పద్మ, ఆరే రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లాపార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్,అద్దంకి, కొండెపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి తదితరులు ఆమెకు బోకే అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.