ప్రకాశం

గురజాడ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 30: మహాకవి గురజాడ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎర్రన విగ్రహం వద్ద సాహితీవేత్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రన, గురజాడ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాకవి, వ్యవహారిక భాషోద్యమకారుడు, గురజాడ అప్పారావు స్మారక భవనం నిర్మించే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్నామాయ స్థలం కేటాయింపులో విజయనగరం మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రముఖ సాహితీవేత్త, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజయనగరంలో సోమవారం గురజాడ ఇంటి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించే మహాకవి గురజాడ అప్పారావు మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌కు శాశ్వత ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, అలాగే వారికి విజయనరగంలో ప్రత్యామ్నాయ ఇంటి స్థలం కేటాయించడంతోపాటు ప్రభుత్వమే స్వయంగా నివాసగృహాన్ని నిర్మించి మహాకవి గురజాడ పట్ల తెలుగుజాతికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా ఒంగోలులోని ఎర్రన విగ్రహం వెనుక భాగంలో ఉన్న వైద్యశాఖకు చెందిన అభ్యంతరకర ఫ్లెక్సీని వెంటనే తొలగించేందుకు జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, కోవెలకుంట్ల బాలకోటయ్య, షేక్ మహబూబ్‌జాన్, శనగపల్లి సుబ్బారావు, ఎనుగుల సురేష్‌బాబు, మాగంటి శ్రీనివాసమూర్తి, మొగిలి దేవప్రసాద్, తాటిపర్తి గోపాలరెడ్డి, ఎం సింగయ్య, లేబూరి క్రిష్ణ, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.