ప్రకాశం

మండుటెండ... జోరువాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మే 30: అప్పటి వరకూ మండుటెండ కాసింది. అంతలోనే వాతావరణం చల్లబడి జోరువాన కురిసింది. పొద్దునంతా వడగాల్పులు, సాయంత్రం ఈదురుగాలులు. ఒకే రోజు పరస్పరం భిన్నమైన వాతావరణ పరిస్థితులు సోమవారం నెలకొన్నాయి. వరుసగా రెండు రోజుల పాటు శని, ఆది వారాల్లో వాతారణం చల్లబడడంతో ఇక ఎండలు తగ్గినట్లేనని జనం భావించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమంగా అది మధ్యాహ్నానికి 42 డిగ్రీలకు చేరింది. దీంతో పాటు వడగాల్పులు కూడా వీచడంతో జనం బెంబేలెత్తారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. తీవ్రమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెట్టు కూలి పడతాయన్న ఆందోళన వ్యక్తమయింది. చివరకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.