ప్రకాశం

జివో 279 రద్దుచేయాలని మున్సిపల్ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 30: మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతీసే జీవో 279ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు బి వెంకట్రావు, కొర్నెపాటి శ్రీనివాసరావు మట్లాడుతూ జీవో 279ని రద్దుచేయాలని గత ఐదు నెలలుగా మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం చాపకింద నీరులా గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఇదిలాఉండగా ఒంగోలు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు మూడు నెలలకు ఒకసారి జీతాలు చెల్లిస్తుండటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, 2015 నవంబరు నెల నుండి కార్మికుని ఖాతాలో పిఎఫ్ నగదు జమకాలేదని, నాలుగు సంవత్సరాల నుండి కార్మిక సంక్షేమ నిధి చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వారు విమర్శించారు. అదేవిధంగా పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాల నుండి కొబ్బరినూనె, చెప్పులు ఇవ్వడంలేదని, విలీన పంచాయతీ కార్మికులకు 2013- 14 సంవత్సరాల పిఎఫ్ స్లిప్‌లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే పై సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె సామ్రాజ్యం , కె గోపి, ఆర్ రాములు, యు కుమారి, కె వెంకాయమ్మ, కె ఇస్సాక్, శ్రీను, వి సురేష్, పి రాహేలమ్మ, కె ఉష, కె రవి పాల్గొన్నారు.