ప్రకాశం

ప్రత్యేక హోదా సాధనకై సిపిఐ ఉద్ధృత పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, మే 30: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఎన్నికల అనంతరం మాట మార్చిందని, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో విస్తృత పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోస్ట్ కోటేశ్వరరావు ఫంక్షన్ హాలులో సిపిఐ జిల్లా సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రత్యేక హోదాను విస్మరించిందన్నారు. త్వరలో సిపిఐ బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో సమావేశమై ప్రత్యేక హోదాపై చర్చిస్తామని, హోదా ఇవ్వని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో బిజెపి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, 100 రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న బిజెపి ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. బిజెపి పాలనలో ఏ రంగం అభివృద్ధి చెందిందో తెలపాలన్నారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి మాట తప్పి కేంద్రమంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడుకు సింగపూర్, జపాన్ పిచ్చి పట్టిందని, 2050 వరకు తానే సిఎంగా ఉంటానని, ప్రపంచంలోకెల్లా ఏపిని ప్రత్యేక రాష్ట్రంగా నిలుపుతామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సంతలో పశువులను కొన్నట్లుగా వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకయ్య, జిల్లా కార్యదర్శి కె అరుణ, సహాయ కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి’
రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ పక్షమా ... బాధితుల పక్షమా తేల్చుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక గోస్ట్ కోటేశ్వరరావు ఫంక్షన్ హాలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి డిపాజిట్ చేసిన బాధితులకు అందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో జూన్ 15వ తేదీన చలో హాయ్‌ల్యాండ్ పేరుతో హాయ్‌ల్యాండ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు అండగా సిపిఐ పోరాటం చేస్తుందన్నారు.