ప్రకాశం

నీటి సంరక్షణ పనులతో కరవురహితంగా జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 30:కరవురహితంగా జిల్లాను మార్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నీటి సంరక్షణ పనులను ప్రారంభించిందని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. సోమవారం ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంటు (ఐఎఫ్‌ఎడి) అంతర్జాతీయ సంస్థ బృందం సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బృందసభ్యులు, జిల్లాకలెక్టర్ మధ్య జిల్లాలో నీటివసతి, ఉపాధిపనులు, చెక్‌డ్యాంలు, పంటసంజీవిని, సాయిల్ హెల్త్‌కార్డులు, నిరుపేద మహిళల్లో జీవనోపాదులు పెంచుట తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వర్షాభావంపై ఆధారపడి ఉందని అయితే వర్షాలులేని కారణంగా నీటిసమస్య కరువు ఏర్పడిందన్నారు. జిల్లాలో సాగర్‌నీటితో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని బృందం సభ్యులకు తెలిపారు. ఈ ఏడాది వర్షాలులేని కారణంగా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు వచ్చిందన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవటంతో వాటిని పెంచేందుకు ప్రభుత్వం నీరు -చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, కాల్వల్లో కుంటల్లో పూడిక తీతపనులతోపాటు వ్యవసాయభూముల్లో పంటసంజీవిని కార్యక్రమం క్రింద సేద్యపుకుంటలు ఏర్పాటు, కాల్వలపై చెక్‌డ్యాంలు లాంటివి చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా పంటసంజీవిని కింద 43వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో పండ్లతోటల పెంపకం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పండ్లతోటలు బోర్లపై ఆధారపడి ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోయినందున ప్రత్యామ్నాయంగా మైక్రో ఇరిగేషన్, స్పింక్లర్లు, రెయిన్‌గన్స్ ద్వారా నీటిని పొదుపుగా వాడటం జరుగుతుందని, అరటి, బత్తాయి, బొప్పాయి పంటలు పండిస్తున్నారని, తక్కువనీటితో చిరుధాన్యాలను రైతులు పండిస్తున్నారని కలెక్టర్ వివరించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించి వలసలను నివారిస్తున్నామని, వాననీటిని వృధాకాకుండా నీటి సంరక్షణ కార్యక్రమాలను విస్తత్రంగా చేస్తున్నామని, ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల పొలాల్లో భూసారపరీక్షలు నిర్వహించి తద్వారా సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి అవసరమైన వాటిని అందించటం జరుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తులు పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది భూగర్భంలో నీటి పరిమాణం రెండుమీటర్ల వరకు పడిపోయిందని బృందం సభ్యుల దృష్టికి కలెక్టర్ తీసుకువచ్చారు. ఈసంవత్సరం రెండున్నర లక్షలమంది రైతులకు సాయిల్‌హెల్త్‌కార్డులను జారీచేసేందుకు నిర్ణయించామన్నారు. ఐటిసి సహకారంతో మిర్చిపంటలో యజమాన్యపద్దతులు, ఎరువుల వాడకం తగ్గించటం వంటి మెళుకువులతో అధికదిగుబడులు సాధించి రైతులు మంచిలాభాలను పొందుతున్నారన్నారు. జిల్లాలో వ్యవసాయం తరువాత పాడిపరిశ్రమ ప్రధాన అవసరమని, జిల్లాలో సుమారు 47లక్షల అన్నిరకాల జంతువులు ఉన్నాయన్నారు. పశువులు తాగేందుకు నీటికొరత,పశుగ్రాసం కొరత ఉన్నందున పశుపోషకులు ఇబ్బందులకు గురౌతున్నారని పశుసంవర్ధకశాఖ ద్వారా సబ్సిడీపై గ్రాసం,విత్తనాలను అందిస్తున్నామన్నారు. పేదమహిళల్లో జీవనోపాధులు పెంచేందుకు పొదుపుసంఘాల్లో చేర్పించి బ్యాంకు లింకేజి, రివాల్వింగ్‌ఫండ్‌ను అందించి ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 80వేల బోర్లు ఉన్నాయని, సిఎస్‌పురంలో ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంటు కార్యక్రమాన్ని చేపట్టడటం జరిగిందన్నారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి,మైనార్టీల ఎస్‌హెచ్‌జిల గ్రూపు వివరాలు, వాటర్‌షెడ్‌పనుల వివరాలు ,అన్నిశాఖలకు సంబంధించిన వివరాలను సేకరించి ఐఎఫ్‌ఎడి బృందం సభ్యులకు అందచేయాలని సిపిఒను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు జిల్లాలో ఆదివారం పశ్చిమప్రాంతంలో పర్యటించి క్షేత్రసందర్శనచేసిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు. ఈసమావేశంలో ఐఎఫ్‌ఎడి బృందం సభ్యులు ఆదినెఫా, ఆయిపొటూర్, సన్‌ప్రీత్‌కౌర్, విన్స్‌ంట్ డార్లాంగ్‌తోపాటు జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.