ప్రకాశం

వైకాపా జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై ఇద్దరు ఎంపిల తర్జనభర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా నూతన అధ్యక్ష పదవి ఎంపికపై ఒంగోలు, నెల్లూరు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. శనివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేకపాటి ఎంపి వైవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ మారుతున్న శాసనసభ్యులపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావులు వైకాపాను వీడి వచ్చేనెల ఒకటి, రెండుతేదీల్లో తెలుగుదేశంపార్టీ గూటికి చేరనున్న నేపధ్యంలో ఎంపిల కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి కందుకూరు నియోజకవర్గం వస్తుంది. దీంతో మేకపాటి కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా వైకాపా అధ్యక్షుడు ముత్తుమల అశోక్‌రెడ్డి వెళ్లిపోతుండటంతో ఆయన స్ధానంలో జిల్లాపార్టీ పగ్గాలు, పార్టీమారిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఎవరిని ఇన్‌చార్జులుగా నియమించాలనే చర్చ వారిద్దరి మధ్య జరిగినట్లు సమాచారం. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలో అన్న విషయాలపై ఎంపిలు ఇద్దరు కులంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా వైకాపా జిల్లా అధ్యక్ష పదవి రేసులో జిల్లాపార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, కెవి రమణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు పార్టీకి పూర్తిస్థాయిలో విధేయతగా ఉన్నారు. దీంతో వారిద్దరిలో ఒకరిని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారో లేక కొత్తవ్యక్తులను రంగంలోకి అధిష్టానం దించుతుందో వేచిచూడాల్సి ఉంది. కెవి రమణారెడ్డి గతంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షునిగాను, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగాను, వైకాపాలో పలు కీలకమైన పదవుల్లో రమణారెడ్డి పనిచేశారు. ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షునిగా ఉన్న సమయంలో విద్యార్థి విభాగాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అభివృద్ధిపథంలో ఉంచారు. దీంతో రమణారెడ్డిని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్టప్రార్టీ ప్రకటించింది. యువజన విభాగం అధ్యక్షునిగాను రమణారెడ్డి మన్ననలను పొందటం జరిగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని వైఎస్ జగన్ స్థాపించిన తరువాత ఆపార్టీలో మొదటనుండి కొనసాగుతూనే ఉన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రలోను రమణారెడ్డి కీలకపాత్రపోషించారు. దీంతో రమణారెడ్డిపేరుకూడా వినిపిస్తుందనే చెప్పవచ్చు. రమణారెడ్డికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, జిల్లా వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంది. దీంతో ఆయన పేరును జిల్లాపార్టీ అధ్యక్షరేసులోకి అధిష్టానవర్గం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్టప్రార్టీనాయకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డి పేరుకూడా తెరపైకి వచ్చిందనే చెప్పవచ్చు. బత్తుల గతంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు. జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రలోనూ బ్రహ్మానందారెడ్డి పాల్గొన్నారు. మొత్తంమీద జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ వ్యూహంపై ఎంపిలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రధానంగా దృష్టిసారించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.