శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అక్రమ సంబంధం కోసం కొడుకును హతమార్చిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, జూన్ 6 : అక్రమ సంబంధం కోసం కన్న కొడుకునే హతమార్చిన కిరాతకపు తల్లి ఉదంతం కురిచేడు మండలంలోని పేరంబొట్లపాలెం గ్రామంలో జరిగింది. డిఎస్‌పి వి శ్రీరాంబాబు తెలిపిన వివరాల ప్రకారం మాచవరపు కోటేశ్వరరావు గత నెల 27వ తేదిన ఉదయం ఆరు గంటలకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతని తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కురిచేడు ఎస్‌ఐ కిశోర్‌బాబు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా పలు అనుమానాలువ్యక్తం కావడంతో లోతుగా దర్యాప్తు చేసి అసలు నిందితులను అరెస్టు చేశారు. మృతుడు కోటేశ్వరరావు (23) తల్లి రమణమ్మ కోటేశ్వరరావు తోడల్లుడు కొండరాతి కోటయ్య (28)తో గత కొద్ది కాలంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. విషయం తెలుసుకున్న మృతుడు కోటేశ్వరరావు తన తల్లి రమణమ్మను, తన తోడల్లుడు కోటయ్య ప్రశ్నించి ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకు కోటేశ్వరరావును తొలగించుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుని కోటయ్యతో కలిసి కొడుకును హత మార్చేందుకు పథకం రూపొందించుకుంది. ఈ నెల 27వ తేది ఉదయం ఆరు గంటల సమయంలో మృతుడు కోటేశ్వరరావు బహిర్భూమికి పొలానికి వెళుతున్నట్లు గుర్తించిన తల్లి, కోటయ్య కలిసి వెళ్లి అతనిపై బలవంతంగా దాడి చేసి కోటేశ్వరరావును హతమార్చారు. హతమార్చిన తరువాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకున వారు తాడుతో చెట్టుకు ఉరి వేశారు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సోమవారం నిందితులను కురిచేడులో అరెస్టు చేసి దర్శి కోర్టులో హాజరుపర్చినట్లు డిఎస్‌పి శ్రీరాంబాబు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ కెవి రాఘవేంద్ర, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 6: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలురైతు తన జీవితాన్ని అర్ధాతరంగా ముగించుకున్న సంఘటన ఇది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని పన్‌చేడు గ్రామానికి చెందిన తూర్పుహరిజనవాడ గ్రామానికి చెందిన కౌలురైతు నక్కా సుబ్బయ్య (55) సోమవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లి తిరిగి వచ్చి దేవుని పటం ముందు కొడవలి తలపాగా ఉంచి అతనితో తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు గంటల సమయంలో పిల్లలు ఇంటి తలుపులు కొట్టగా ఎంతకీ సమాధానం రాకపోవడంతో గ్రిల్‌లేని కిటికీ గుండా లోపలకు వెళ్లి అక్కడ పురుగుల మందు వాసన వస్తోందని పిల్లలు కేకలు వేసి తలుపులు తీశారు. కుటుంబ సభ్యులు గమనించే సమయానికే అతను మరణించినట్లు తెలిసింది. సుబ్బయ్యకు ఒక ఎకరా సొంత పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలు భూమిలో గత రెండేళ్ల నుంచి పత్తి, చేమ పంటలను సాగు చేశాడు. వాటిలో ఎకరాకు సంవత్సరానికి 60 నుంచి 80 వేల రూపాయల వరకు నష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే సమయంలో అతని సొంత పొలంలో సుబ్బయ్య కుమారుడు అనిల్ వెనామీ రొయ్యలు సాగుచేసి ఆదాయం పొందాడు. ఈ ఆదాయంతో కుమార్తె వివాహం చేశారు. కౌలు పొలంలో వచ్చిన నష్టాన్ని తీర్చే దారిలేక తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బయ్య ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.